రోజా, అనసూయ, రష్మీ, సుధీర్‌, ఆది.. భారీగా రెమ్యూనరేషన్స్ పెంచిన జబర్దస్త్ కమేడియన్స్

First Published Apr 7, 2021, 10:42 AM IST

`జబర్దస్త్` షోకి ఏళ్లు గడుస్తున్న క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. పైగా ఇంకా పెరుగుతుంది. అలాగే జబర్దస్త్ కమెడీయన్లు కూడా రెమ్యూనరేషన్స్ పెంచుతున్నారు. జడ్జ్ లు రోజా, మనో, యాంకర్లు అనసూయ, రష్మీల నుంచి కమెడీయన్లు సుధీర్‌, హైపర్‌ ఆది, శ్రీను.. ఇలా ఇప్పటి వరకు పారితోషికం భారీగానే పెంచారు. 

`జబర్దస్త్` కమెడీయన్లకి ఇదొక పెద్ద వరం. ఎంతో మందిని సినిమాలకు పరిచయం చేసిందీ షో. ఇందులో చాలా మంది సినిమాల్లో హాస్యనటులుగా, ఇతర పాత్రలతో మెప్పిస్తున్నారు. మరికొందరు వ్యక్తిగత వ్యాపారాలు పెంచుకుని సెటిల్‌ అయ్యారు. మొత్తానికి ఆర్టిస్టులుగా నిరూపించుకోవాలనుకునే వారికి `జబర్దస్త్` పునాది వేస్తుంది. టాలెంట్‌ ఎంకరేజ్‌ షోగా, ఎంతో మందికి లైఫ్‌ ఇస్తున్న షోగా నిలుస్తుంది.
undefined
కొన్ని ఏళ్లుగా ఈ షో రన్‌ అవుతుంది. అయినా ఏమాత్రం బోర్‌ ఫీలవ్వడం లేదు ఆడియెన్స్. మొదట్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు ఎక్కువయ్యాయి, బూతు షో అనే కామెంట్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ షో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
undefined
ఆ క్రేజ్‌కి తగ్గట్టుగా ఇందులో పాల్గొంటున్న కమెడీయన్లు కూడా పారితోషికాలు పెంచేస్తున్నారు. రోజా, మనో, అనసూయ, రష్మీ నుంచి సుధీర్‌, ఆది, శ్రీను, భాస్కర్‌ వరకు చాలా మంది తాజాగా తమ రెమ్యూనరేషన్స్ పెంచేశారు. లేటెస్ట్ రెమ్యూనరేషన్స్ ఇవే అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.
undefined
ప్రస్తుతం జడ్జ్ గా ఉన్న రోజా లేటెస్ట్ గా మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఒక్కో ఎపిసోడ్‌కి తీసుకుంటుందట. నాగబాబు ఉన్నప్పుడు కూడా దాదాపు మూడు లక్షల వరకు పారితోషికం తీసుకునే వారట. అయితే ఆయన వెళ్లిపోయాక రోజా రెమ్యూనరేషన్‌ పెంచారని టాక్‌. నెలకు ఎనిమిది ఎపిసోడ్లు చేస్తే దాదాపు ముప్పై లక్షల వరకు రోజాకి ఇస్తున్నారని సమాచారం.
undefined
ఇక నాగబాబు స్థానంలో వచ్చిన సింగర్‌ మనో కూడా జడ్జ్ గా యాప్ట్ అవుతున్నారు. ఆయన ఈ షోకి ఒక్కో ఎపిసోడ్‌కి రెండు లక్షల పారితోషికం అందుకుంటున్నారట.
undefined
యాంకర్స్ లో అనసూయకి ఉన్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడి కోసం షోస్‌ చూసేవాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడు మొదటి నుంచి యాంకర్‌గా ఉంది. ఆమె గతంలో ఎనభై వేల వరకు తీసుకునేది. ఇప్పుడు పెంచేసిందట. ఏకంగా ఒక్కో ఎపిసోడ్‌కి లక్షా ఇరవై వేలు అందుకుంటుందట. ఈ లెక్కన దాదాపు పది లక్షల వరకు అనసూయ పారితోషికం అందుకుంటున్నట్టు టాక్‌.
undefined
క్రేజ్‌లో `జబర్దస్త్` రష్మీ క్రేజ్‌ వేరయా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ అమ్మడు సుధీర్‌తో కలిసి నడిపించే లవ్‌ స్టోరీకి మరింత క్రేజ్‌. ఆ క్రేజ్‌కి తగ్గట్టే పారితోషికం గుంజేస్తుందీ హాట్‌ బ్యూటీ. ఈ అమ్మడి నెలకి దాదాపు ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్‌గా అందుకుంటుందట.
undefined
జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్‌ టీమ్‌(సుధీర్‌, శ్రీను, రాంప్రసాద్‌)కి మంచి క్రేజ్‌ ఉంటుంది. ఈ టీమ్‌ సైతం మూడు లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారట.
undefined
అయితే ఇటీవల సుధీర్‌ పారితోషికం బాగానే పెంచాడట. దాదాపు నాలుగు లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.
undefined
పంచ్‌ల మాస్టర్‌ హైపర్‌ ఆది 2.5 లక్షలు నుంచి మూడు లక్షల వరకు తీసుకునేవాడట. లేటెస్ట్ గా మూడు లక్షలు అందుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
undefined
జబర్దస్త్ లో చమ్మక్‌ చంద్రకి కూడా భారీగానే పాపులారిటీ ఉంది. ఆయన ఈ షోకి నెలకు దాదాపు నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నట్టు టాక్‌.
undefined
మరో డిఫరెంట్‌ మ్యానరిజమ్‌తో కామెడీని పంచే అదిరే అభి సైతం భారీగానే తీసుకుంటున్నాడట. ఆయన తాజాగా రెండు లక్షల వరకు పొందుతున్నట్టు టాక్‌.
undefined
రాకెట్‌ రాఘవకి 2.75 నుంచి మూడు లక్షల వరకు ఇస్తున్నట్టు తెలుస్తుంది.
undefined
అలాగే చలాకీ చంటికి రెండు లక్షలు ఇస్తున్నారట.
undefined
డిఫరెంట్‌ స్టయిల్‌తో మెప్పిస్తున్న భాస్కర్‌ సైతం రెండు లక్షలు నెలకు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
undefined
వీరితోపాటు ఇతర కమెడీయన్లకి కూడా దాదాపు లక్ష వరకు అందిస్తున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
undefined
click me!