ఆసుపత్రి బెడ్ పై జబర్దస్త్ రోహిణి.. సర్జరీ కోసం వెళితే చేతులెత్తేసిన వైద్యులు, ఆ కష్టం భరిస్తూనే..

First Published | May 14, 2023, 9:41 PM IST

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో రోహిణి నవ్విస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మరింత పాపులర్ అయింది. బుల్లితెరపై లేడీ కమెడియన్ గా రోహిణి కడుపుబ్బా నవ్విస్తోంది.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో రోహిణి నవ్విస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని మరింత పాపులర్ అయింది. బుల్లితెరపై లేడీ కమెడియన్ గా రోహిణి కడుపుబ్బా నవ్విస్తోంది. నవ్వించడం మాత్రమే కాదు అవసరం అయినప్పుడు అదిరిపోయే స్టెప్పులతో రోహిణి డ్యాన్స్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. 

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉన్నట్లు.. రోహిణి లైఫ్ లో కూడా ఎవరికీ తెలియని కన్నీటి గాధలు ఉన్నాయి. గతంలో ఎదురైనా సమస్యల వల్ల రోహిణి ఇప్పటికి ఇబ్బందులు పడుతూనే ఉంది. రోహిణి తన యూట్యూబ్ ఛానల్ లో తాజాగా షాకింగ్ విషయం రివీల్ చేసింది. 


2016లో రోహిణి తీవ్రమైన యాక్సిడెంట్ కి గురైంది. దీనితో ఆమె కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. వైద్యులు సర్జరీ చేసి రాడ్ వేశారు. నయం అయినప్పటికీ లోపల రాడ్ ఉండడం వల్ల ఇప్పటికి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బందిగానే ఉంటోంది అని రోహిణి పేర్కొంది. ఆడియన్స్ కి వినోదం అందించడం కోసం కాలు నొప్పిగా ఉన్నప్పటికీ స్టెప్పులు వేస్తున్నట్లు రోహిణి పేర్కొంది. 

చాలా ఏళ్ళు గడిచింది కదా ఇక రాడ్ తీయించి వేద్దాం అని ఆసుపత్రికి వెళ్లిందట. దీనితో రాడ్ తీయడం కోసం వైద్యులు ఆమెకి అన్ని పరీక్షలు నిర్వహించి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ థియేటర్ కి తరలించారు. రాడ్డు బయటకి తీయాలని ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. ఎముక లోపల రాడ్డు బాగా కూరుకుపోయింది అని వైద్యులు తెలిపారు. 

బలవంతంగా బయటకి తీస్తే ఎముక దెబ్బతిని మరోసారి విరిగిపోయే ప్రమాదం ఉందని చేతులెత్తేశారు. రాడ్డుని అలాగే వదిలేయడం మంచిదని సలహా ఇచ్చారు. డ్యాన్స్ చేసేటప్పుడు నొప్పి రాకుండా కొన్ని రకాల మందులు ఇచ్చారట. కాస్త ఇబ్బందిగా ఉన్నా రాడ్డుని అలాగే ఉంచుకోవడం బెటర్ అని వైద్యులు చెప్పారట. రాడ్డు తీయించుకుని మరింత ఉత్సాహంగా బుల్లితెర షోలలో పాల్గొనాలని ప్రయత్నించిన రోహిణికి ఇది నిరాశే. 

rohini

అప్పటి యాక్సిడెంట్ తలచుకుంటే ఇప్పటికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అని రోహిణి ఎమోషనల్ అయింది. రోహిణి త్వరగా కోలుకోవాలని అభిమానులంతా కామెంట్స్ చేస్తున్నారు. 

Latest Videos

click me!