
`జబర్దస్త్`(Jabardasth) కామెడీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ళు ఇది విజయవంతంగా రన్ అవుతుంది. ప్రారంభం నుంచి సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) కమెడీయన్‌గా, రష్మి(Anchor Rashmi) యాంకర్‌గా రన్ అవుతున్నారు. రాణిస్తున్నారు. ఈ ఇద్దరు జోడీ ఆద్యంతం ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తుంది. అయితే ఎప్పుడూ వీరికి సంబంధించిన మిస్టరీ కొనసాగుతూనే ఉంటుంది. వీరిద్దరు లవర్సా? స్నేహితులా? అనేది సస్పెన్స్ కొనసాగుతుంది.
అయితే తమ రిలేషన్‌పై ఫస్ట్ టైమ్ ఓపెన్ అయ్యారు సుధీర్, రష్మి. చాలా ఫ్రీగా తమ బంధం గురించి చెప్పారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. తమ జీవితంలోని జరిగిన ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. రహస్యాలను వెల్లడించారు. దీనికి `స్టార్ మా` వేదిక కావడం విశేషం. ఎప్పుడూ ఈటీవీలో సందడి చేసే ఈ జంట `స్టార్‌మా`లో `హోళీ తగ్గేదెలే` షోలో పాల్గొన్నారు.
ఇందులో పాల్గొన్న టీవీ లేడీ ఆర్టిస్టులను ఉద్దేశించి, వారిని అందాన్ని పొగుడుతూ పాటలు పాడి అలరించారు సుధీర్. బ్యాక్ టూ బ్యాక్ వారి స్పెషాలిటిపై పాటలు పాడి వారిని ఫిదా చేశాడు. అందరి హృదయాలను గెలుచుకున్నారు. చివరగా రష్మి వంతు వచ్చింది. లవ్ డ్యూయెట్ పాటలతో ఆమెని ఫిదా చేశాడు. స్టేజ్‌పైకి పిలిపించుకుని మరీ రష్మిపై ప్రేమ గీతాలు పాడారు. తెలుగులోనే కాదు, హిందీలోనూ పాడి ఆమె మనసు దోచుకున్నారు.
సుధీర్ పాడుతున్నంత సేపు అలా ఉండిపోయింది రష్మి. ఆ పాటలను, అందులోని అర్థాన్ని ఎంజాయ్ చేసింది. ఎమోషనల్ అయ్యింది. గుండె బరువెక్కింది. మొత్తంగా సుధీర్ పాటలకు రష్మి పడిపోయిందనే చెప్పాలి. స్టేజ్‌పై ఆమె గుంబనంగా మారిన విధానం అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ని ప్రస్తావించాడు యాంకర్ రవి. రష్మి గురించి, ఆమెలో నచ్చిన క్వాలిటీస్ చెప్పమని అడగ్గా, తను ఇండిపెండెంట్, స్ట్రాంగ్ ఉమెన్ అని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని, వెనక్కి తగ్గదని, చాలా హార్డ్ వర్కర్ అని ప్రశంసలు కురిపించారు.
ఇప్పటి వరకు రష్మికి చెప్పలేని మాట ఏంటి? అని అడగ్గా, `రష్మి నువ్వు చాలా అందంగా ఉంటావ్` అని చెప్పాడు సుధీర్. ఆన్ స్క్రీన్‌పై చెప్పాను, కానీ రియల్ లైఫ్ లో ఇప్పటి వరకు ఆ మాట చెప్పలేదని, ఇప్పుడు చెబుతున్నానని తెలిపాడు సుధీర్. దీంతో మరింతగా ఫిదా అయిపోయింది రష్మి.
తనకు చూపించలేనిది, మెమరీగా ఉండిపోయేది ఏంటని అడగ్గా, తమ ఇద్దరి మధ్య చేసిన ప్రోమో అని, ఇప్పుడు దాన్ని చూపించలేనని తెలిపారు. ఆ తర్వాత తమ మధ్య చాలా జరిగాయని, అవి కూడా చూపించలేనని చెప్పి నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగిన విషయాన్ని బయటపెట్టారు. ఇద్దరి మధ్య ఓ సందర్భంలో గొడవ జరిగిందని, స్క్రీన్‌పై స్కిట్‌లో భాగంగా చేసిన ఒక విషయాన్ని రష్మి తప్పుగా అర్థం చేసుకుందని, దీంతో పెద్ద గొడవైందని చెప్పాడు.
ఆ గొడవ ఎప్పటికీ మర్చిపోలేనని, దాని వల్ల దాదాపు ఏడెనిమిదేళ్లు అవుతుందని, ఎప్పుడూ మళ్లీ గొడవ పడలేదని తెలిపింది రష్మి. ఆ గొడవ కారణంగా ఫస్ట్ టైమ్ రెండు రోజులు మాట్లాడుకోలేదట. ఆ తర్వాత షోలో కలిశామని, అయితే తనకిష్టమైన స్వీట్ ఒకటి అతనికి తెలుసని, ఆ స్వీట్ పంపించి కూల్ చేశాడని తెలిపింది. ఆ స్వీట్‌తో ఇద్దరం కలిసి ఏడ్చేశారట. గట్టిగా హగ్ చేసుకున్నట్టు తెలిపింది యాంకర్ రష్మి. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ అలా గొడవ పడలేదని తెలిపింది.
ఈ సందర్భంగా తమ రిలేషన్‌పై స్పందించారు. తమ మధ్య ఉన్న రిలేషన్‌ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తామేంటో తమకు తెలుసని, ఇలా జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో అంటుంటారని, అ అది జరిగిందటగా, ఇది జరిగిందటగా అంటూ ఎగ్జైట్ అవుతుంటారు. వాళ్లకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది రష్మి. సుధీర్‌గా కూడా దీనిపై ఇలానే స్పందించారు. రవి కూడా మీ రిలేషన్‌ని చెప్పాల్సిన అవసరం లేదని, దాన్ని అలానే కంటిన్యూ చేయాలని చెప్పాడు.
రష్మి ఫోన్ నెంబర్ ఏ పేరుతో సేవ్ చేసుకుంటావని సుధీర్‌ని, యాంకర్ రవి అడగ్గా.. రష్మి అనే ఉంటుందని, ఆ తర్వాత `ఓపెనింగ్` అని పెట్టానని, ఆ టైమ్‌లో ఆమె షాపింగ్ ఓపెనింగ్స్ లో బాగా పాల్గొనేదని, ఎప్పుడు ఫోన్ చేసినా ఆ షాపింగ్ మాల్, ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో ఉన్నానని చెబుతుందని అందుకే అలా పెట్టానని, ఆ తర్వాత రష్మిగానే మార్చుకున్నట్టు తెలిపారు సుధీర్.
ఇప్పటి వరకు సుధీర్‌కి ఇవ్వాలనుకుని ఇవ్వలేనిది ఏంటని ప్రశ్నించగా, రష్మి, సుధీర్‌ల మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు ఆద్యంతం రక్తికట్టించాయి. అంతా ముద్దు పెడుతుందేమో అనుకున్నారు. సుధీర్ కూడా అలానే డబుల్ మీనింగ్‌తో మాట్లాడుతూ నవ్వులు పూయించారు. ఊరించి ఊరించి ఓ ఫ్లవర్ ఇచ్చింది రష్మి. అయితే తాను ఇవ్వాలనుకున్నది అది కాదని చెప్పింది. మళ్లీ కాసేపు ఊరించింది. చివరికి తన కనురెప్పలకున్న కాటుకని చేతితో తీసి సుధీర్ చెంపపై పెట్టింది. `నీకు, నీ పర్‌ఫెర్మెన్స్ కి, భవిష్యత్‌కి దిష్టి తగలకుండా ఉండేందుకు` అని చెప్పింది రష్మి.
అనంతరం సుధీర్, రష్మి కలిసి స్టేజ్‌పైనే హోళీ ఆడారు. రంగులు పూసుకున్నారు. అందరిని కనువిందు చేశారు. దీనిపై రవి స్పందిస్తూ మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలని, మీరు ఎంతో మందికి ఆదర్శమని, మీరు కలిసి ఇలానే మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్టు ఇన్‌స్పైరింగ్ వర్డ్స్ చెప్పాడు. మొత్తంగా వీరిద్దరి మధ్య జరిగిన ఎపిసోడ్ మాత్రం అందరిని కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.