జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు.