అమ్మాయిలా ఉంటాడు, పెళ్లి వద్దు అన్నారు.. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో భార్యతో జబర్దస్త్ మోహన్ 

Published : May 12, 2024, 04:55 PM IST

లేడి గెటప్పుల్లో ఎక్కువగా కనిపించే జబర్దస్త్ మోహన్ తొలిసారి తన భార్యతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు. 

PREV
16
అమ్మాయిలా ఉంటాడు, పెళ్లి వద్దు అన్నారు.. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో భార్యతో జబర్దస్త్ మోహన్ 

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు. లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్తగా ముస్తాబవుతోంది.   

26

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ప్రోమో ఫన్నీగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్, ఫైమా లాంటి వాళ్లంతా నవ్వులు పూయిస్తున్నారు. ఆటో రాంప్రసాద్, రష్మీ మధ్య అతడు సినిమా తరహాలో కామెడీ సీన్ జరిగింది. 

36

బుల్లితెర నటీనటులు కొందరు సరదాగా స్కిట్ లు చేశారు. అనంతరం లేడి గెటప్పుల్లో ఎక్కువగా కనిపించే జబర్దస్త్ మోహన్ తొలిసారి తన భార్యతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు. 

46

గత నెలలోనే జబర్దస్త్ మోహన్ వివాహం జరిగింది. దేవి అనే అమ్మాయిని మోహన్ పెళ్లి చేసుకున్నాడు. జబర్దస్త్ కమెడియన్లు కూడా మోహన్ వివాహానికి హాజరయ్యారు. కాగా జబర్దస్త్ మోహన్ ఇప్పుడు తన భర్యతో కలసి తొలిసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రేక్షకులకు కనిపించాడు. 

56

జబర్దస్త్ మోహన్ కి లేడీ గెటప్పులు ఎక్కువగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు తన భార్యతో కూడా మోహన్ లేడీ గెటప్పు లోనే వేదికపై మెరిశాడు. దీనితో అంతా ఆశ్చర్యపోయారు. ఫస్ట్ టైం తన భార్యని తీసుకుని వస్తూ ఇలా లేడీ గెటప్పులో ఉన్నదేంటి అని అంత షాక్ అయ్యారు. ఆ తర్వాత అతడి భార్య దేవి మాట్లాడింది. మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అని రష్మీ ప్రశ్నించింది. 

66

మాది లవ్ అండ్ అరేంజ్డ్ అని మోహన్ భార్య సమాధానం ఇచ్చింది. మా అమ్మానాన్నకి  మోహన్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే అమ్మాయిలాగా ఉంటాడు.. ఎక్కువగా అమ్మాయి పాత్రలు వేస్తుంటాడు అని అన్నారు. కానీ తాను మోహన్ ని ఇష్టపడి అమ్మానాన్నని ఒప్పించి చేసుకున్నట్లు దేవి తెలిపింది. 

click me!

Recommended Stories