అలా నటిగా మారి తాను తన ఫ్యామిలీని, సిస్టర్స్ ని సెట్ చేశాను. అవన్నీ అబ్సర్ చూశాడు. అందుకే తనని ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన ఫ్యామిలీ గురించి కూడా నాకు తెలుసు. నటుడిగా సీరియల్స్ చేశాడు, రైటర్‌గానూ కొన్ని సినిమాలు, సీరియల్స్ కి పనిచేశాడు. అయితే వారికి ఎక్స్ పోర్ట్ వ్యాపారం ఉంది. దాన్ని చూసుకుంటుంటారు. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో నీకు ఎవరు దొరకరు, నాకూ ఎవరు దొరకరు రా ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామన్నాడు. అలా ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, చాలా విచిత్రంగా తాము ఒక్కటయ్యామని తెలిపింది ఇంద్రజ. సుమన్ టీవీలో ఈ విషయాలను పంచుకుంది ఇంద్రజ.