సుమ కనకాల అసలు రూపం బయటపెట్టిన తాగుబోతు రమేష్‌.. తట్టుకోలేక లేచివెళ్లిపోయిన టాప్‌ యాంకర్‌

Published : Apr 09, 2022, 06:22 PM IST

యాంకర్‌ సుమ అందరికి పంచ్‌లు వేస్తుంది. షాక్‌ల మీద షాక్‌లిస్తూ నవ్వులు పూయిస్తుంది. కానీ ఈ సారి ఆమె జబర్దస్త్ కమెడీయన్లకి దొరికిపోయింది. దీంతో `జబర్దస్త్` వేదికగా యాంకర్‌ సుమ అసలు రూపం బయటపెట్టేశారు. 

PREV
17
సుమ కనకాల అసలు రూపం బయటపెట్టిన తాగుబోతు రమేష్‌.. తట్టుకోలేక లేచివెళ్లిపోయిన టాప్‌ యాంకర్‌

సుమ కనకాల.. టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత కాస్ట్లీ యాంకర్‌ తనే. స్టార్‌ హీరోయిన్ల కంటే కూడా బిజీగా ఉంటారు. ఓ వైపు టీవీ షోలు, మరోవైపు సినిమా ప్రోగ్రాములు, ఇంకో వైపు సెలబ్రిటీల స్పెషల్‌ ఇంటర్వ్యూలు, మరోవైపు యూట్యూబ్‌ ఛానెల్‌ వీడియోలు, ఇంకోవైపు కొత్తగా సినిమాల్లోనూ నటిస్తుంది. ఇలా నాలుగు చేతులా సంపాదిస్తుంది సుమ. 

27

`క్యాష్‌`, `స్టార్ట్ మ్యూజిక్‌` వంటి షోలకు యాంకర్‌గా చేస్తున్న సుమ.. ఫస్ట్ టైమ్‌ అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తున్న `జబర్దస్త్` షోలో మెరిసింది. స్టేజ్‌పై స్కిట్లు వేయడంతోపాటు జడ్జ్ గానూ వ్యవహరించింది. అందరికి నవ్వులు పూయించింది. అలరించింది. తనలోని కొత్త యాంగిల్స్‌ ని ఆవిష్కరించింది. `జబర్దస్త్` షోకి కొత్త కళని, సరికొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. సుమ నటిగా మారి `జయమ్మ పంచాయితీ` చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా `జబర్దస్త్`షోలో మెరిసింది సుమ. 

37

ఇందులో కాసేపు ఆమె కమెడియన్‌గా వ్యవహరించింది. ఇతర ఆర్టిస్టులతో కలిసి పంచ్‌లు వేసి నవ్వులు పూయించింది. మరోవైపు జడ్జ్ గానూ తనదైన పంచ్‌లతో రెచ్చిపోయింది. మరోవైపు `జబర్దస్త్` షోలోని అందరి స్కిట్లు సుమ మీదనే ఉండటం విశేషం. ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆమెపై పంచ్‌లు, సెటైర్లు వేస్తూ కామెడీ పంచారు. 
 

47

ఇంత వరకు బాగానే ఉంది. కానీ తాగుబోతు రమేష్‌ మాత్రం యాంకర్‌ సుమలా మారిపోయాడు. ఆమెలా చీరకట్టి రెడీ అయ్యారు. తాను హోస్ట్ గా చేసే షోలో సుమ ఎలా ఉంటుందో కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆమె అసలు రూపం బయటపెట్టాడు. 

57

అయితే తాగుబోతు రమేష్‌.. తన గెటప్‌ వేసుకుని వస్తుంటూనే జడుసుకుంది సుమ. ఆయన్ని చూసి సీట్లో నుంచి లేచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. పక్కనే ఉన్న జడ్జ్ లు మనో, రోజా లు సముదాయించి కూర్చోబెట్టారు. ఆ తర్వాత తాగుబోతు రమేష్‌ మరింతగా రెచ్చిపోయాడు. 

67

సుమ షో చేసేటప్పుడు మేకప్‌ ఎలా వేసుకుంటుందో, ఎంతగా వేసుకుంటుందో చూపించారు. అంతేకాదు మేకప్‌ తీస్తే గుర్తుపట్టలేవని, ఒకేసారి చూస్తే భయపడతావని తెలిపాడు. `క్యాష్‌` ప్రోగ్రామ్‌లో ఆమె ఎలా వ్యవహరిస్తుందో చూపించారు. ఆమో నిద్రలో కూడా క్యాష్‌ ప్రోగ్రామ్‌ని కలవరిస్తుండటం చూపించాడు.  సుమ అంటే జోక్సే కాదు, అప్పుడప్పుడు సీరియస్‌ కూడా అవుతుందని, ఇది ప్రోమోగా కట్‌ చేసుకోండి అంటూ పంచ్‌ల మీద పంచ్‌లు వేశాడు తాగుబోతు రమేష్‌. ఈ స్కిట్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. 

77

మరోవైపు ఆమె సినిమాపై, ఆమె ఏజ్‌లపైన కూడా, ఆమె ఫ్యామిలీపై ఇలా దేన్నీ వదల్లేదు, జబర్దస్త్ స్కిట్లు అన్నీ యాంకర్‌ సుమ మీద, సుమకి సంబంధించినవే వేసి, ఆల్మోస్ట్ ఆమెకి సంబంధించిన విషయాలన్ని బయటపెట్టేశారు. రోజా, మనోలు కూడా ఆమెని వదల్లేదు, ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. తాజాగా విడుదలైన `జబర్దస్త్` ప్రోమో నెట్టింట వైరల్‌ అవుతుంది. ప్రోమోలోనే ఈ రేంజ్‌లో ఉందంటే, ఇక పూర్తి షోలో రచ్చ రచ్చే అని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories