అమ్మ ఇంటింటికి వెళ్లి పాచి పని చేసేది.. ఆకలి బాధలు పంచుకుంటూ కన్నీటి పర్యంతమైన జబర్దస్త్ కమెడియన్

Published : Nov 07, 2022, 09:38 PM ISTUpdated : Nov 07, 2022, 09:40 PM IST

జబర్దస్త్ కమెడియన్లు తెరపై తమదైన హాస్యంతో నవ్వులు పూయిస్తున్నారు. ఆడియెన్స్ ని నవ్వించడం కోసం ఎంతో శ్రమిస్తుంటారు. ఆడియెన్స్ కళ్లల్లో నవ్వుల్లోనే తమ ఆనందాన్ని వెతుకుంటారు. కానీ ఆ నవ్వు వెనకాల అంతులేని కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని జబర్దస్త్ కమెడియన్‌ వెల్లడించారు. 

PREV
17
అమ్మ ఇంటింటికి వెళ్లి పాచి పని చేసేది.. ఆకలి బాధలు పంచుకుంటూ కన్నీటి పర్యంతమైన జబర్దస్త్ కమెడియన్

లేడీ గెటప్‌లకు `జబర్దస్త్` వేదికగా మారుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది మేల్ కమెడీయన్లకి లైఫ్‌ ఇచ్చింది ఈ లేడీ గెటప్స్. చమ్మక్‌ చంద్రతో ఈ ట్రెండ్‌ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ అది కొనసాగుతుంది. పదుల సంఖ్యలో హాస్యనటులు లేడీ గెటప్‌లతో నవ్వులు పంచుతున్నారు. వారిలో శాంతి స్వరూప్‌ ఒకరు. తాజాగా తన నవ్వుల వెనకాల కన్నీళ్లని వెల్లడించారు. 
 

27

`జబర్దస్త్`లో లేడీ గెటప్‌లతో పాపుల్‌ అయిన శాంతి స్వరూప్‌, మోహన్‌, హరిత, సాయిలేఖ తాజాగా సుమ యాంకర్ గా చేస్తున్న `క్యాష్‌` ప్రోగ్రామ్‌కి గెస్ట్ లుగా వచ్చారు. తమ మదర్‌, పాదర్‌లతో కలిసి సందడి చేశారు. `జబర్దస్త్`కి మించిన కామెడీతో ఆద్యంతం నవ్వులు పూయించారు. షోని సందడిగా మార్చారు. 

37

ఈ క్రమంలో శాంతి స్వరూప్‌ ఓపెన్‌ అయ్యాడు. తాను జబర్దస్త్ కి రాకముందు ఎలాంటి బాధలు పడ్డారో వెల్లడించారు. తమ ఫ్యామిలీ ధీన స్థితి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. శాంతి స్వరూప్‌ తన మదర్‌ సరోజనమ్మతో కలిసి షోకి వచ్చిన నేపథ్యంలో అమ్మ పడ్డ బాధలను తెలిపాడు. తాము చిన్నప్పుడు అమ్మ ఇంటింటికి తిరిగి పాచిపనులు చేసేదని పేర్కొన్నారు. అంట్లూ తోమి తమని పోషించందన్నాడు. 
 

47

అంతేకాదు ఆ సమయంలో తాము ఆకలి బాధలను అనుభవించినట్టు చెప్పాడు. `అమ్మ చాల ఇళ్లల్లో పాచి పనులు, ఆంట్లు తోమేది. అప్పుడు మాకు ఆకలి బాధ ఎలా ఉండేదంటే? అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ రోజులను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు. 
 

57

అంతేకాదు అమ్మకి గొంతు సరిగా లేదని, ఆమె సరిగా మాట్లాడలేదని తెలిపాడు. ఏదో మాట్లాడాలనుకుంటుంది. కానీ మాట్లాడలేదు అంటూ అందరిని భావోద్వేగానికి గురి చేసింది. దీంతో శాంతి స్వరూప్‌ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకే తనని బతికిస్తున్నాడని, ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నాడని చెబుతూ ఆమె భోరున విలపించింది.
 

67

ఓ వైపు శాంతి స్వరూప్‌, మరోవైపు ఆయన తల్లి కన్నీళ్లు పెట్టుకోవడంతో క్యాష్‌ షోలోని మిగిలిన ఆర్టిస్టులందరి గుండెలు బరువెక్కాయి. ఆ బాధలు వింటూ చలించిపోయారు. జస్ట్ ప్రోమోలోనే ఇలా ఉంటే, ఇక ఆయన పూర్తిగా తన కష్టాలు చెబితే కన్నీళ్లు ఆగవని ప్రోమోని చూస్తుంటే అర్థమవుతుంది. ఇది నవంబర్ 12న ప్రసారం కానుంది. 
 

77

శాంతి స్వరూప్‌ గతంలోనూ ఓ సందర్భంలో తమ ఫ్యామిలీ పరిస్థితిని వెల్లడించారు. తాము ఎంతటి గడ్డు పరిస్థితిని అనుభవించామో వెల్లడించారు. హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో రెంట్లు కట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నానని, డబ్బుల్లేక అనారోగ్యంతో బాధ పడుతున్న తన నాన్నని దక్కించుకోలేకపోయామని తెలిపాడు. నాన్న అంత్యక్రియలకు కూడా అప్పు చేయాల్సి వచ్చిందని తెలిపారు శాంతి స్వరూప్. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories