వాడుకుని వదిలేసి మరొకడితో, ఆ లోపం వల్లేనా.. కన్నీళ్లు తెప్పిస్తున్న జబర్దస్త్ కమెడియన్ లవ్ స్టోరీ..

Published : Sep 08, 2022, 03:55 PM IST

జబర్దస్త్ కమెడియన్స్ లలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. దాదాపు అందరూ కష్టాలు పడి ఎదిగినవారే. జబర్దస్త్ లో వీళ్లంతా నవ్వించే స్కిట్స్ చేస్తుంటారు. ఇతర షోలలో అప్పుడప్పుడు కొన్ని ఎమోషనల్ స్కిట్ లు కూడా చేస్తుంటారు.

PREV
16
వాడుకుని వదిలేసి మరొకడితో, ఆ లోపం వల్లేనా.. కన్నీళ్లు తెప్పిస్తున్న జబర్దస్త్ కమెడియన్ లవ్ స్టోరీ..

జబర్దస్త్ కమెడియన్స్ లలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. దాదాపు అందరూ కష్టాలు పడి ఎదిగినవారే. జబర్దస్త్ లో వీళ్లంతా నవ్వించే స్కిట్స్ చేస్తుంటారు. ఇతర షోలలో అప్పుడప్పుడు కొన్ని ఎమోషనల్ స్కిట్ లు కూడా చేస్తుంటారు. వారి రియల్ లైఫ్ ప్రతిబింబించేలా కన్నీళ్లు తెప్పించే స్కిట్స్ చేస్తుంటారు. 

26

జబర్దస్త్ నరేష్ గురించి పరిచయం అవసరం లేదు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. ఈ నెల 11న ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో నరేష్ అద్భుతమైన ఎమోషనల్ స్కిట్ పెర్ఫామ్ చేశాడు. అతడు చేసిన స్కిట్ లవ్ స్టోరీ. తన రియల్ రియల్ లైఫ్ లో కూడా లవ్ స్టోరీ ఉందట. నరేష్ తన లోపాన్నే బలంగా మార్చుకుని కమెడియన్ గా రాణిస్తున్నాడు. 

36

ముందుగా నరేష్ పెర్ఫామ్ చేసిన స్కిట్ విషయానికి వస్తే.. నరేష్ ఓ ఈవెంట్ లో డాన్స్ చేస్తుండగా అతడి డ్యాన్స్ కి ఒక అందమైన అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది. దీనితో ఇద్దరూ ప్రేమలో పడతారు. నరేష్ ఆ అమ్మాయితో రొమాంటిక్ గా డ్యాన్స్ కూడా చేస్తాడు.  ఒక రోజు ఆ అమ్మాయి తన అసలైన బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా మాట్లాడడం నరేష్ గమనిస్తాడు. ఇంకా ఆ పొట్టోడితోనే తిరుగుతున్నావా అని ఆమె బాయ్ ఫ్రెండ్ అడుగుతాడు. అలా కాదు అభి ఆ పొట్టోడు ఈవెంట్స్ లో సంపాదించినా డబ్బు మొత్తం తీసుకు వాడుకుని వదిలేద్దాం అని చెబుతుంది. 

46

తనని ప్రేమ పేరుతో మోసం చేయడం మాత్రమే కాక తన లోపాన్ని హేళన చేయడంతో నరేష్ గుండె పగిలిపోతుంది. గుండె పగిలేలా ఏడుస్తాడు. పిచ్చోడుగా మారిపోతాడు. నరేష్ చేసే ఈ మోషనల్ పెర్ఫామెన్స్ కన్నీళ్లు తెప్పించడం ఖాయం. నరేష్ పెర్ఫామెన్స్ కి గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ సదా కూడా ఆశ్చర్యపోతుంది. ఎమోషనల్ అవుతుంది. 

56

స్కిట్ పూర్తయ్యాక మీరు చాలా సహజంగా నటించారు అంటూ నరేష్ ని సదా ప్రశంసిస్తుంది. మీ లైఫ్ లో ఇలాంటిది నిజంగా జరిగిందా అని అడుగుతుంది. దీనికి నరేష్ ఉంది మేడం అని బదులిస్తాడు. సో నరేష్ తన రియల్ లైఫ్ స్టోరీనే స్కిట్ గా పెర్ఫామ్ చేసి చూపించాడు. 

66

ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది, సన్నీ, ఆటో రాంప్రసాద్, నూకరాజు వీళ్లంతా ఇల్లీగల్ ఎఫైర్స్ కాంటెస్ట్ పేరుతో ఫన్నీగా ఉండే రెజ్లింగ్ పోటీ నిర్వహించారు. వీరి రెజ్లింగ్ పోటీ నవ్వులు పూయించే విధంగా ఉంది. వీళ్ళు రెజ్లింగ్ తో నవ్విస్తే.. నరేష్ తన లవ్ స్టోరీతో ఏడిపించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories