సావిత్రి ముందు డాన్స్ చేస్తూ పడిపోయిన చిరంజీవి... మహానటి దగ్గరకు పిలిచి ఏమన్నారో తెలుసా?

Published : Apr 03, 2024, 08:15 AM IST

మహానటి సావిత్రితో చిరంజీవి తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఒకసారి సావిత్రి ముందు డాన్స్ చేస్తూ ఆయన క్రింద పడిపోయారట. అప్పుడు సావిత్రి అన్నమాటలను ఆయన వెల్లడించారు.   

PREV
17
సావిత్రి ముందు డాన్స్ చేస్తూ పడిపోయిన చిరంజీవి... మహానటి దగ్గరకు పిలిచి ఏమన్నారో తెలుసా?


లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి సినీ ప్రస్థానం వివరిస్తూ సావిత్రి క్లాసిక్స్ పేరుతో బుక్ ఆవిష్కరించారు. హైదరాబాద్ వేదికగా మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. చిరంజీవి, సురేఖ దంపతులు సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మానందం, మురళీమోహన్, తనికెళ్ళ భరణి వంటి నటులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.


 

27

సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని రచయిత సంజయ్ కిషోర్ రాశారు. ఈ వేదికపై మాట్లాడిన చిరంజీవి సావిత్రి నటనను కొనియాడారు. అలాగే ఆమెతో చిరంజీవికి ఉన్న అనుభవాలు, సాన్నిహిత్యం గుర్తు చేసుకున్నారు. 

37


నా యాక్టింగ్ కోర్స్ ఇంకా పూర్తి కాలేదు. 1978లో నాకు పునాదిరాళ్ళు సినిమా ఆఫర్ వచ్చింది. నరసింహరాజు హీరో. మీతో పాటు మరొక ఇద్దరు కుర్రాళ్లు నటిస్తున్నారు అని నాతో చెప్పారు. షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్ళాము. 

 

47
chiranjeevi

అప్పుడు మీరు ఎవరితో నటిస్తున్నారో తెలుసా.. సావిత్రిగారితో అని చెప్పారు. ఆమె బస చేసిన హోటల్ కి తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారు. ఆమెను చూసి నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. నీ పేరు ఏమిటని ఆమె అడిగారు. ఒకటి రెండు రోజుల క్రితమే ప్రసాద్ నుండి నేను చిరంజీవిగా మారాను. చిరంజీవి అని చెప్పాను. మంచిది అని ఆమె అన్నారు. 

57
chiranjeevi

పునాదిరాళ్లు సినిమా షూటింగ్ జరుగుతుండగా వేసవిలో వర్షం పడింది. ఇంటి వరండా గచ్చు వర్షపు జల్లుకు తడిసింది. సావిత్రి గారితో చిరంజీవి బాగా డాన్స్ చేస్తారు, చూడండి అని చెప్పారు. నా దగ్గర ఒక టేపు రికార్డర్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఉండేవాడిని. 
 

67
chiranjeevi

టేపు రికార్డర్ ఆన్ చేసి పాటకు డాన్స్ వేస్తుంటే ఫ్లోర్ తడిసి ఉండటం వలన నా కాలు జారి క్రింద పడ్డాను. పడినా కూడా డాన్స్ చేస్తూనే ఉన్నాను. అందరు చప్పట్లు కొట్టారు. సావిత్రి గారు దగ్గరకు పిలిచి క్రింద పడినా ఆపకుండా డాన్స్ చేశావు. నీలో స్పోర్టివ్నెస్ నచ్చింది. భవిష్యత్ లో మంచి నటుడివి అవుతావు.. అన్నారు. 

 

77
chiranjeevi

తర్వాత సావిత్రి గారితో ప్రేమ తరంగాలు అనే ఒక చిత్రం చేశాను. ఆ మూవీలో సావిత్రి కొడుకుగా నటించాను. తర్వాత ఆమెను నేను కలిసే అవకాశం రాలేదు. ఇంతలోనే సావిత్రి గారు కాలం చేశారు అని చిరంజీవి వెల్లడించారు. 

click me!

Recommended Stories