ఎర్ర చీరలో అదిరిపోయిన బిగ్ బాస్ బ్యూటీ పోజులు.. చీరకట్టులో దెత్తడి హారిక బ్యూటీఫుల్ లుక్.. పిక్స్

First Published | Jun 4, 2023, 1:50 PM IST

యంగ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. 
 

యూట్యూబ్ సెన్సేషనర్ దేత్తడి హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే మంచి పాపులారిటీని దక్కించుకుంటోంది. గతంలో యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. 
 

‘బిగ్ బాస్’తో బుల్లితెర ఆడియెన్స్ లో మంచి ఫేమ్ దక్కించుకుంది హారిక (Bigg Boss Harika) . సీజన్ 4లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్ ను ఫిదా చేసింది. తోటి కంటెస్టెంట్లకు గట్టిపోటీనిచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరి వరకు నిలవలేకపోయింది. 
 


ఏదేమైనా బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక హారికకు మరింత క్రేజ్ పెరిగింది. గతంలోనే నటిగా అవకాశాలు వచ్చినా ఈ ముద్దుగుమ్మ పట్టించుకోలేదు. రియాలిటీ షో తర్వాతనైనా వెండితెరపై మెరుస్తుందని భావించిన ఫ్యాన్స్ ఆశలు ఫలించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.
 

మరోవైపు మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తూ వస్తోంది. రీసెంట్ గా ‘వెళ్లకే’ అనే బ్యూటీఫుల్ సాంగ్ లో నటించింది. సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సాంగ్ షూటింగ్ లో ఎర్రచీరలో అందరినీ ఆకట్టుకుంది అలేఖ్య. తాజా ఆ చీరలోని కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

ఎర్రచీరలో అలేఖ్య బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో కుర్ర హృదయాలను కొల్లగొట్టేలా ఫోజులిచ్చింది. కొంటె చూపులు, మత్తెక్కించే నవ్వుతో చూపుతిప్పుకోకుండా చేసింది. ఈ ఫొటోలను యంగ్ బ్యూటీ సిరితో పాటు ఫ్యాన్స్ లైక్స్ చేస్తున్నారు. కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

అయితే, హారికకు సినిమా నుంచి ఎలాంటి అవకాశాలు వస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో ఆయా ఓపెనింగ్ ఈవెంట్లకు, బుల్లితెర షోల్లో సందడి చేస్తోంది. నెట్టింట ఎప్పుడూ నయా లుక్స్ లో మెరుస్తూ తన క్రేజ్ మరింత పెంచుకునే పనిలో నిమిగ్నమైంది. 

Latest Videos

click me!