కమెడియన్ అలీ టాలీవుడ్ లో చాలా సీనియర్. 1980 నుంచే సీతా కొక చిలుక లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అంటే దాదాపుగా అలీ 45 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు. కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలీ రాణించాడు. లెజెండ్రీ నటులు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు, చిరంజీవి లాంటి వారందరితో అలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.