వర్ష అమ్మాయి కాదని తెలిసింది అప్పుడే... ఇమ్మానియేల్ షాకింగ్ కామెంట్స్ 

Published : Dec 10, 2022, 08:16 PM IST

వర్ష అమ్మాయి కాదంటూ ఇమ్మానియేల్ సంచలన కామెంట్స్ చేశారు. జనాల్లో ఈ అనుమానం ఎప్పటి నుండో ఉండగా... ఇమ్మానియేల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

PREV
17
వర్ష అమ్మాయి కాదని తెలిసింది అప్పుడే... ఇమ్మానియేల్ షాకింగ్ కామెంట్స్ 
Varsha

వర్ష-ఇమ్మానియేల్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేర్లు. ఈ విలక్షణ ప్రేమ జంటకు భారీ ఫేమ్, ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ వేదికగా కలిసిన ఈ జంట సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. 
 

27
Varsha

సీరియల్ యాక్టర్ అయిన వర్ష జబర్దస్త్ లేడీ కమెడియన్ అవతారం ఎత్తారు. ఆమె ఓ రెండేళ్ల క్రితం ఈ లెజెండరీ కామెడీ షోకి వచ్చారు. ఆ నిర్ణయం వర్ష ఫేట్ మార్చేసింది. అనతి కాలంలో ఫేమస్ అయ్యింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన ఆడియన్స్ కి వర్ష గ్లామర్ సరికొత్త అనుభూతి పంచింది. 
 

37

ఇక వర్షను ఫేమస్ చేసిన మరొక అంశం... ఇమ్మానియేల్ తో లవ్ ఎఫైర్. వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పిచ్చ ఫేమస్. ఈ జంటను బుల్లితెర ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. వర్ష ఇమ్మానియేల్ పై విపరీతమైన అభిమానం చూపుతుంది. అతడు దేవుడు ఇచ్చిన వరం, ఏది ఏమైనా వదిలేది లేదంటుంది. 
 

47


ఇటీవల ఇమ్మానియేల్ వర్ష మెడలో తాళి కట్టాడు. వర్ష ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా హ్యాపీగా కట్టించుకుంది. అసలు వీరి మధ్య నిజంగా ప్రేమ ఉందా? కెరీర్ కోసం, సెన్సేషన్ కోసం ఇలా చేస్తుంటారా? అనే సందేహాలు ఉన్నాయి. 
 

57
Jabardasth Varsha


అయితే అప్పుడప్పుడు ఈ జంట మధ్య గిల్లికజ్జాలు చోటు చేసుకుంటాయి. వర్షను లేడీ గెటప్ అంటూ వేధిస్తూ ఉంటారు. ఒకసారి ఇమ్మానియేల్ కూడా వర్షను లేడీ గెటప్ అన్నాడు. వర్షకు చిర్రెత్తుకొచ్చింది. పదే పదే అంటే ఊరుకోనని ఫైర్ అయ్యింది. లేడీ గెటప్ లో ఉన్న అబ్బాయని వర్షను ఎవరైనా అంటే నచ్చదు. 

67

మరోసారి ఇమ్మానియేల్ ఇదే కామెంట్ చేశారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఇమ్మానియేల్ రాజు గెటప్ వేశాడు. ఆయన భార్యగా వర్ష నటించింది. నేను ఉండగా మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని వర్ష స్కిట్ లో భాగంగా అడుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్నాకే తెలిసింది అమ్మాయి కాదని, అందుకే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా... అంటూ సెటైర్ వేశాడు. 
 

77

ఈ జోక్ స్కిట్ ప్రాక్టీస్ లో ఉందో లేదో తెలియదు కానీ.. అమ్మాయి కాదు అనగానే వర్ష మొహం సీరియస్ గా మారిపోయింది. మరి వర్ష రియాక్షన్ ఏమిటో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి. కాగా వర్ష అబ్బాయా? అమ్మాయా? అనే సందేహం బుల్లితెర ప్రేక్షకుల్లో ఉంది. 
 

click me!

Recommended Stories