తొమ్మిదేళ్లు ఒకే ట్రాక్‌.. రష్మి గౌతమ్‌ పాత జ్ఞాపకాలను తోడిన జబర్దస్త్ కమెడియన్‌.. యాంకర్‌ రియాక్షన్‌ ఏంటంటే?

Published : May 19, 2024, 05:29 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌.. మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేశాడు రామ్‌ ప్రసాద్‌. షోలో అందరి ముందు ఆ ప్రస్తావన తీసుకొచ్చి రష్మిని ఇబ్బంది పెట్టాడు.   

PREV
17
తొమ్మిదేళ్లు ఒకే ట్రాక్‌.. రష్మి గౌతమ్‌ పాత జ్ఞాపకాలను తోడిన జబర్దస్త్ కమెడియన్‌.. యాంకర్‌ రియాక్షన్‌ ఏంటంటే?

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌ పదేళ్లుగా ఒకే షో చేస్తుంది. `జబర్దస్త్` కి యాంకర్‌గా రాణిస్తుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌గా నిలిచింది. జబర్దస్త్ షోని రక్తికట్టించడంలో, మంచి రేటింగ్‌ రావడంలో ఆమె పాత్ర చాలా ఉంటుందని చెప్పొచ్చు. ఆమె అందాలు, క్యూట్‌ డైలాగ్స్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. జబర్దస్త్ కమెడియన్‌  పంచ్ లు వేసినా అంతే స్పోర్టీవ్ గా తీసుకుంటుంది. అందుకే ఇన్నాళ్లపాటు సర్వైవ్‌ అవ్వగలిగింది.  
 

27

జబర్దస్త్ షోలోనే లవ్‌ ట్రాక్‌ నడిపించింది రష్మి గౌతమ్‌. జబర్దస్త్ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆడిపాడింది. లవ్‌ ట్రాక్‌ని పీక్‌కి తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే రేంజ్‌లో పండింది. షోలోనే లవ్‌ ప్రపోజ్‌ చేసుకున్నారు. రింగులు తొడుక్కున్నారు. పెళ్లికి కూడా సిద్దమయ్యారు. ఎప్పటికప్పుడు తమ ట్రాక్‌ని హైలైట్‌ చేస్తూ వచ్చారు. నిజంగానే ప్రేమించుకుంటున్నారనేంతగా రక్తికట్టించారు. ఆల్మోస్ట్ 9ఏళ్లపాటు వీరి ట్రాక్‌ నడిచింది. షోకి మంచి టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చింది. 

37
photo credit-ETV Balagam Promo

ఇదిలా ఉంటే గతేడాది నుంచి సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ మానేశాడు. సినిమాల్లో బిజీ అవుతున్న నేపథ్యంలో జబర్దస్త్ మానేశాడు సుధీర్‌. దీంతో ఇద్దరు దూరమయ్యారు. ఆ తర్వాత ఏదో ఒకటి రెండు సందర్భాల్లో కలవడం తప్పితే ఆల్మోస్ట్ దూరమయ్యారు. ఇప్పుడు ఒంటరిగానే షోస్‌ చేస్తుంది రష్మి. సుధీర్‌ని మర్చిపోయినట్టే అనేలా ఆమె సాగుతుంది. ఈ క్రమంలో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు జబర్దస్త్‌ కమెడియన్‌. 
 

47

జబర్దస్త్ కమెడియన్‌, సుడిగాలి సుధీర్‌ ఫ్రెండ్‌ రామ్‌ ప్రసాద్‌.. మరోసారి సుధీర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే పేరు ప్రస్తావించలేదుగానీ అదే విషయంపై పంచ్‌లు వేశాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో రైల్వే ట్రాక్‌కి సంబంధించిన స్కిట్‌ని ప్రదర్శించారు. రైల్ లేట్‌ అవుతుందని తెలియడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ వారితో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పెట్టుకుందామనుకున్నారు. 
 

57

దీంతో యాంకర్‌ రష్మి, జడ్జ్ ఇంద్రజలని ఆహ్వానించారు. రైల్వే ట్రాక్‌పై ఎంటర్టైన్‌ చేయాల్సి ఉంటుంది. ఇది చూసిన రష్మి గౌతమ్‌.. పట్టాలేంటి, ట్రైన్‌ ఏంటి, ట్రాక్‌ ఏంటి? నేను ఈ ట్రాక్‌పై నిల్చోలేను అని చెబుతుంది రష్మి. దీంతో అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు రామ్‌ ప్రసాద్‌. అమ్మా మర్చిపోయావా తొమ్మిదేళ్లు ఒకే ట్రాక్‌ నడిపించావు. ఇప్పుడు రెండు గంటలు కూడా ఉండలేవా అని కౌంటర్‌ వేశాడు రామ్‌ ప్రసాద్‌. 
 

67

దీంతో రష్మి గౌతమ్‌కి దిమ్మతిరిగిపోయింది. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. అలా చూస్తుండిపోయింది. మరోవైపు ఇంద్రజ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుడిగాలి సుధీర్‌, రష్మిల మధ్య చాలా గ్యాప్‌ వచ్చింది. ఇద్దరూ మర్చిపోతున్నారు. ఈ క్రమంలో రామ్‌ ప్రసాద్‌ పాత పుండుని గెలికినట్టుగా చేయడంతో రష్మి ఇబ్బంది పడుతూ కనిపించింది. మొత్తంగా ఏదో రూపంలో సుధీర్‌ ప్రస్తావనతో ఆమెని ఆడుకుంటున్నాడు జబర్దస్త్ కమెడియన్స్. అయితే దీన్ని ఆమె పాజిటివ్‌ గా తీసుకోవడం విశేషం. 
 

77

సినిమాల్లోకి వెళ్లిన సుడిగాలి సుధీర్‌ మళ్లీ బుల్లితెరకి రీఎంట్రి ఇస్తున్నాడు. ఇప్పటికే `ఆహా`లో సర్కార్‌ 4 షో చేస్తున్నాడు. అలాగే ఇటీవల `ఫ్యామిలీ స్టార్స్` పేరుతో ఈటీవీలో కొత్త షోని ప్రారంభించారు. ఓ రకంగా రష్మికి పోటీగా ఈ షోని తీసుకురాబోతున్నారని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories