ఇంట్లో ఒంటరిగా ఉండే సమంత ఏం చేస్తుందో తెలుసా.. ప్రైవేట్ పిక్ వైరల్!

Published : May 19, 2024, 05:10 PM IST

స్టార్ లేడీ సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. విడాకులు అనంతరం ఆమె మరొక పెళ్లి చేసుకోలేదు. రిలేషన్ పెట్టుకోలేదు.  ఒంటరిగా ఉంటున్న సమంత ఇంట్లో ఏం చేస్తుందో అన్న విషయం వెలుగులోకి వచ్చింది.   

PREV
16
ఇంట్లో ఒంటరిగా ఉండే సమంత ఏం చేస్తుందో తెలుసా.. ప్రైవేట్ పిక్ వైరల్!
Samantha

సమంత కెరీర్ పరంగా ఫుల్ సక్సెస్. 2010లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. వరుస హిట్స్ తో ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. సౌత్ ఇండియాను ఏలుతుంది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఒక ఏడాది కాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంది. 

26
Samantha

ఇటీవల తన బర్త్ డే కానుకగా ఓ ప్రాజెక్ట్ ప్రకటించింది. మా ఇంటి బంగారం ఈ చిత్ర టైటిల్. ఈ ప్రాజెక్టు తో సమంత నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది సమంత. ఈ బ్యానర్ లో మా ఇంటి బంగారం మూవీ తెరకెక్కనుంది. 

 

36

కాగా సమంత ఒంటరిగా ఉన్నపుడు ఏం చేస్తుందో వెలుగులోకి వచ్చింది. సమంతకు హైదరాబాద్ లోనే హౌస్ ఉంది. నాగ చైతన్య-సమంత ఓ పెంట్ హౌస్ లో కాపురం ఉండేవారు. అది మురళీ మోహన్ కి సంబంధించిన అపార్ట్మెంట్. కొత్తగా ఇల్లు కట్టుకుంటూ నాగ చైతన్య-సమంత ఆ ఇంటిని అమ్మేశారు. 

46

కొత్త ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే సమంత-నాగ చైతన్య విడిపోయారు. దాంతో అమ్మేసిన పెంట్ హౌస్ ని సమంత మరలా అమ్మిన ధరకు మించి చెల్లించి దక్కించుకుందట. ఆ ఇంట్లోనే సమంత నివాసం ఉంటుంది. కాగా ఇంట్లో ఉంటే సమంతకు ఒకటే వ్యాపకం. 

56
Samantha

సమంత వద్ద రెండు పెట్ డాగ్స్ ఉన్నాయి. ఒకటి హ్యాష్ కాగా, మరో షాష. ఈ రెండు పెట్ డాగ్స్ తో ఆమె ఆడుకుంటూ ఉంటారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో సమంత షేర్ చేసింది.నన్ను ఎప్పుడూ అతుక్కుని ఉండే డార్లింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో వైరల్ అవుతుంది. 

 

66

ఇక సమంత అప్ కమింగ్ చిత్రాల గురించి మాట్లాడుకుంటే మా ఇంటి బంగారం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. సిటాడెల్ సిరీస్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అల్లు అర్జున్-అట్లీ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories