బ్రతికుండగానే చంపేస్తున్నారు.. జబర్థస్త్ అప్పారావ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Published : Jun 26, 2023, 04:50 PM IST

ఎమోషనల్ అయ్యాడు జబర్థస్త్ ఫేమస్ కమెడియన్.. బుల్లితెర సీనియర్  అప్పారావు. సోషల్ మీడియా లో జరుగుతున్న పరిణామాలు, యూట్యూబ్ లో థంబ్ నెల్స్ పై అప్పారం ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

PREV
16
బ్రతికుండగానే చంపేస్తున్నారు.. జబర్థస్త్ అప్పారావ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

లేట్ గా వచ్చినా.. కామెడీ కింగ్ అనిపించుకున్నాడు జబర్థస్త్ ఫేమస్ కమెడియన్ అప్పారావు. ఎప్పుడో 30 ఏళ్ళ కిందట నుంచి రంగస్థల నటుడిగా కొనసాగుతూ.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అప్పారావు కు.. కాస్త లేట్ గా అవకాశాలు అందాయి. వెండితెరపై కనిపించేసరికి ఆయనకు చాలా వయస్సు అయిపోయింది. 

26

అయితే యువకులను మించిన ఉత్సాహంతో దూసుకుపోతూ... చిన్న చితకా వేశాలు వేసుకుంటూ.. ఇండస్ట్రీ మీద ప్రేమతో కొనసాగుతున్న అప్పారావుకు జబర్ధస్త్ కామెడీ షో మంచి లైఫ్ ను ఇచ్చింది. స్టేజ్ మీద అప్పారావు ఉంటే.. స్కిట్ హిట్ కొట్టకుండా ఏండేది కాదు.. అంతలా తన మార్క్ కామెడీతో అప్పరావు సందడి చేశారు.  

36

ఇక తాజాగా ఓ యూట్యూబ్‌  ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియా వల్ల.. యూట్యూబ్ థంబ్ నేయిల్స్ వల్ల నటీనటులు ఫేస్ చేస్తున్న మానసిక క్షోభ గురించి చెబుతూ..  ఎమోషనల్‌ అయ్యారు. ఆయన మాట్లాడుతూ..యూట్యూబ్‌ వాళ్లందరూ వినాలి. ఎందుకంటే దీని మీద నేనొక నాటిక రాద్దాము అనుకున్నా.. యూట్యూబూ నీకో దండం.  చాలా బాధతో ఈ విషయం చాలా బాధతో చెపుతున్నాను అన్నారు.

46

ప్రస్తుతం విషయం తెలియకుండానే.. ఎది పడితే అది రేసేస్తున్నారు. గొప్ప గొప్ప నటులు అంతా బ్రతికుండగానే.. చంపేస్తున్నారు. పిచ్చి పిచ్చి థబ్ నెయిల్స్ తో ఇబ్బంది పెడుతున్నారు. ఇది నేను కొంచె బాధతో చెబుతున్నా. నిజాలు రాయండి. ఉన్నది ఉన్నట్టు రాయండి. అంతే కాని చనిపోకముందే.. చినిపోయినట్టు రాయకండి.. అన్నారు. 

56

నో డౌట్‌. సోషల్‌ మీడియా ఇప్పుడు బలంగా ఉంది. కాబట్టి నేను అంగీకరిస్తాను. మనిషి బతికుండగా చనిపోయాడు అని చెప్పే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. నేను నేరుగా మాట్లాడుతున్నా. ఎవరైనా చనిపోవాల్సిందే. వార్తలు రాసిన వారు కూడా చనిపోవాల్సిందే. లింక్‌ ఓపెన్‌ చేయడానికి దారుణమైన కాప్చన్స్‌ పెట్టకండి. లేనిపోని వన్నీ పెట్టేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయకండి. పెద్దవారి అందరి తరపునా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ప్రస్తుతం అప్పారావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

66

అప్పారావు మాట్లాడుతూ.. 1984 నుంచి నేను నాటకాలలో నటించడం మొదలుపెట్టాను. అలా కొంతకాలం పాటు రంగస్థలంపై నటిస్తూ వెళ్లిన నేను, ఆ తరువాత 'శుభవేళ' అనే సినిమా తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను.  చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వెళుతున్న నన్ను, 'షకలక శంకర్' జబర్దస్త్ కామెడీ షోకి పరిచయం చేశాడు. ఈ రోజున నేను ఇక్కడి వరకూ రావడానికి కారణం ఆయనే" అని అన్నాడు.
 

click me!

Recommended Stories