జబర్దస్త్ యాంకర్ పొజీషన్ కోసం చాలా మంది యాంకర్స్ పోటీపడ్డారు. అనూహ్యంగా సౌమ్యరావు దక్కించుకుంది. బెంగుళూరుకి చెందిన సీరియల్ నటికి మల్లెమాల ఛాన్స్ ఇచ్చింది. శ్రీముఖి, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణుప్రియ వంటి తెలుగు భామలు రంగంలోకి దిగుతారని అనుకుంటే అనూహ్యంగా సౌమ్యరావుని అదృష్టం వరించింది.