హీరోయిన్ సదా అన్నం తింటుందా అందం తింటుందా... నేలకొచ్చిన చందమామలా ఉంది!

Published : Jul 22, 2023, 02:44 PM IST

హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ సదా అందం ఇసుమంత తగ్గలేదు. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని మేని ఛాయతో మైమరిపిస్తోంది.   

PREV
18
హీరోయిన్ సదా అన్నం తింటుందా అందం తింటుందా... నేలకొచ్చిన చందమామలా ఉంది!
Sadaa

బుల్లితెర షో కోసం సదా మిల్కీ రోజా కలర్ లాంగ్ ఫ్రాంక్ ధరించి. సదరు డ్రెస్ లో సదా గ్లామర్ రెట్టింపయింది. సదా అందం మైకం తెప్పిస్తుంటే, అమ్మడు అన్నం తింటుందా? అన్నం తింటుందా ? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. 

 

28
Sadaa

కాగా సదాకు పెళ్లి అంటే ఇష్టం లేదట. పెళ్లితో స్వేచ్ఛ కోల్పోతాము. అందులో నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ని జంతువులను ఇష్టపడతాను. వివాహం పట్ల ఆసక్తి లేదని ఆమె చెప్పడం సంచలనమైంది. సదా వయసు 39 ఏళ్లు కాగా వివాహ బంధంలో అడుగు పెట్టను అంటుంది. 
 

38
Sadaa

ప్రస్తుతం సదా బుల్లితెర షోలలో సందడి చేస్తుంది. నీతోనే డాన్స్ పేరుతో సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో ఇటీవల ప్రారంభమైంది. ఈ షోకి సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్నారు. నీతోనే డాన్స్ షోలో సదా గ్లామర్ డామినేట్ చేస్తుంది. 


 

48
Sadaa

ఇటీవల విడుదలైన అహింస మూవీతో సదా రీఎంట్రీ ఇచ్చింది.  దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీగా దర్శకుడు తేజా తెరకెక్కించాడు. అహింస మూవీలో సదా కీలక రోల్ చేసింది. ఈ మూవీ నిరాశపరిచింది. 

58
Sadaa

ఇక సదాను వెండితెరకు పరిచయం చేసింది తేజానే కావడం విశేషం. తేజా కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉన్న జయం చిత్రంలో సదా హీరోయిన్ గా చేశారు. నితిన్ సైతం ఇదే మూవీతో హీరో అయ్యాడు. జయం మూవీ సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

 

68
Sadaa

అనంతరం ఎన్టీఆర్ కి జంటగా నాగ చిత్రం చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సదా జతకట్టిన మరో పెద్ద హీరో బాలకృష్ణ. వీరి కాంబోలో తెరకెక్కిన వీరభద్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 
 

78
Sadaa

మంచి ఆరంభం లభించిన  సదా కెరీర్ నిర్మించుకోలేకపోయింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. తెలుగులో ఎన్టీఆర్, బాలకృష్ణ తప్పితే పెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. 

88
Sadaa


అనూహ్యంగా శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు చేసే అవకాశం దక్కింది. అగ్రహారం బ్రాహ్మణ అమ్మాయి పాత్రకు సదాను ఎంపిక చేశారు. శంకర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ పాత్రకు సదా వంద శాతం న్యాయం చేసింది. అపరిచితుడు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత సదాకు మరో హిట్ పడలేదు. దాంతో హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యింది. 
 

click me!

Recommended Stories