`జబర్దస్త్` యాంకర్ మళ్లీ మారింది.. సౌమ్యరావు స్థానంలో బిగ్‌ బాస్‌ బ్యూటీ.. ఆపుకోలేక నూకరాజు సెటైర్లు

Published : Nov 05, 2023, 05:33 PM ISTUpdated : Nov 05, 2023, 05:36 PM IST

జబర్దస్త్ ఫ్యాన్స్ కి బిగ్‌ బ్రేకింగ్‌. యాంకర్‌ సౌమ్య రావు స్థానంలో కొత్త యాంకర్‌ వచ్చింది. బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన సిరి హన్మంతు యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది.  

PREV
15
`జబర్దస్త్` యాంకర్ మళ్లీ మారింది.. సౌమ్యరావు స్థానంలో బిగ్‌ బాస్‌ బ్యూటీ.. ఆపుకోలేక నూకరాజు సెటైర్లు

`జబర్దస్త్` షోకి యాంకర్లు మారిపోతున్నారు. హాట్‌ యాంకర్‌ అనసూయ తప్పుకున్నాక ఆమె స్థానంలో ఎవరు ఎవరు అనేది పెద్ద చర్చ జరిగింది. పలు యాంకర్లతో ప్రయోగాలు జరిగాయి. కానీ చివరికి కొత్త యాంకర్‌ని దింపారు. కన్నడ భామ సౌమ్య రావుని యాంకర్‌ని ఫిక్స్ చేశారు. దాదాపు ఏడాదిన్నర నుంచి సౌమ్య రావు యాంకరింగ్‌ చేస్తుంది. ఆమెకి మంచి మార్కులే పడుతున్నాయి. రేటింగ్‌ పరంగానూ బాగానే ఉంది. 
 

25

కానీ ఇప్పుడు అనూహ్యంగా యాంకర్‌ని మార్చేయడం ఆశ్చర్య పరుస్తుంది. కొత్త యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది బిగ్‌ బాస్‌ భామ సిరి హన్మంతు. యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ.. బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. అందులో టాప్‌ 5లో నిలిచి ఆకట్టుకుంది. అదే సమయంలో షణ్ముఖ్‌తో కలిసి ట్రావెల్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌లో రచ్చ చేసింది. 

35

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా బిజీ అవుతుంది. ఈ క్రమంలో ఈ అమ్మడికి యాంకర్‌గా పెద్ద ఆఫర్‌ రావడం విశేషం. తెలుగు టీవీ షోస్‌లో విశేష ఆదరణ పొందుతున్న `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌గా ఎంపిక కావడం విశేషమనే చెప్పాలి. ఈ షోతో అటు అనసూయ, రష్మి గౌతమ్‌ స్టార్లుగా ఎదిగారు. స్టార్‌ యాంకర్లుగా రాణించారు. రష్మి ఇప్పటికీ యాంకర్‌గా చేస్తూ మెప్పిస్తుంది. 
 

45

అయితే జబర్దస్త్ షోకి అనసూయ వెళ్లాక సౌమ్య రావు యాంకరింగ్‌ చేసింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆమె స్థానంలో సిరి హన్మంతు రావడం విశేషం. కొత్త యాంకర్‌కి జడ్జ్ లు, కమెడియన్లు ఆహ్వానం పలికారు. ఆమెని హైలైట్‌ చేస్తూ షోని నడిపించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సిరి చేసిన రచ్చ, సందడి ఆకట్టుకుంటుంది. అందరిని అలరిస్తుంది. ప్రోమోలో సిరి హైలైట్‌ అవుతుంది. 
 

55

అయితే సౌమ్య స్థానంలో ఈ బ్యూటీని యాంకర్‌గా దించడం ఆశ్చర్యపరుస్తుంది. ఉన్నట్టుండి సౌమ్య రావు తప్పుకోవడానికి కారణమేంటనేది ఆసక్తికరంగా మారింది. ఆమె పూర్తిగా తప్పుకుందా లేక, వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజులు లీవ్‌ తీసుకుందా? అనేది సస్పెన్స్ నెలకొంది. అయితే సిరిపై పంచ్‌లు వేస్తూనే ఉన్నారు. నూకరాజు ఆపుకోలేక పంచ్‌ వేశాడు. కొత్త యాంకర్‌ నెలరోజులే అంటూ కామెంట్‌ చేశారు. దీంతో సిరి మొఖం వాడిపోయినంత పనైంది. తాజాగా విడుదలైన ప్రోమో వైరల్‌ అవుతుంది. నూకరాజు అన్నట్టు సిరి నెల రోజులే ఉంటుందా? లేక కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories