విశాల్ కు ఏదైనా వ్యాధి ఉందా అన్నా నుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని. అందుకే అలా అయిపోయారని.. వైరల్ ఫీవర్ మూలగానే విశాల్ అలా కనిపిప్తున్నారంటూ మరో మాట బయటకు వచ్చింది. మదగజరాజ సినిమా ఈవెంట్ కోసమే.. ఆయన కష్టమైనా వచ్చారని ఆయన టీమ్ నుంచి వచ్చిన సమాచారం.
అయితే సోషల్ మీడియాలో మాత్రం విశాల్ కు సబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ డూప్ లేకుండా స్ట్రంట్స్ చేసేవారు. ఈక్రమంలో ఓ షూటింగ్ లో ఆయన తలకు దెబ్బ తగడం వల్ల లోపల రెండు నరాలు డామేజ్ అయ్యాయని, దాంతో ఆయనకు తీవ్రమైన తలనొప్పి వస్తుండేదట.దాంతో విశాల్ విదేశాల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడట.