సంక్రాంతి రిలీజ్ లకు భారీ షాక్ ఇచ్చిన పుష్ప

First Published | Jan 8, 2025, 10:25 AM IST

సంక్రాంతికి రిలీజ్ కానున్న చిత్రాలైన గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో పాటు పుష్ప 2 కూడా జనవరి 11 నుండి థియేటర్లలో రచ్చ చేయనుంది. 20 నిమిషాల అదనపు ఫుటేజ్ తో పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సంక్రాంతి బరిలో కొత్త ట్విస్ట్ నెలకొంది.


సంక్రాంతి 2025 కు మరికొద్ది రోజులే ఉంది. ఈ క్రమంలో  మూడు రోజుల్లో సంక్రాంతి సినిమాలు థియేటర్స్ లోకి దూకనున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10న, బాలకృష్ణ డాకు మహారాజ్ జనవరి 12న, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రానున్నాయి.

ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణాలో ఈ సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. మేజర్ థియేటర్స్ అన్ని ఈ మూడు సినిమాల పంపిణీ మొదలైంది. ఇండస్ట్రీ కూడా సంక్రాంతి సినిమాలు ఒకదానికొకటి పోటీ కాకుండా గ్యాప్ తో ప్లాన్ చేసుకుంటున్నాయి. ఒక్కో సినిమాకు రెండు రోజులు గ్యాప్ ఇస్తున్నారు. ఈ క్రమంలో  ఏ సినిమాకీ ఇబ్బంది లేకుండా థియేటర్స్ ఇచ్చి కలెక్షన్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు.
 


సంక్రాంతి సినిమాలకు ఊహించని విధంగా  పుష్ప 2 షాక్ ఇచ్చింది. పుష్ప 2 సినిమాలో మరో 20 నిముషాలు సీన్స్ జతచేసి మళ్ళీ జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

దీంతో ఈ వార్త మీడియాలో, టాలీవుడ్ లో చర్చగా మారింది.  అయితే ఇలా పుష్ప మళ్లీ సీన్ లోకి దూకటం చాలా మందికి నచ్చటం లేదు. ఆల్రెడీ సంక్రాంతి సినిమాలు ఉన్న సమయంలో దీనికి థియేటర్స్ ఎలా ఇస్తారు అని  చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాగే అసలే ఇప్పటికే సినిమా  లెంగ్త్ పెరిగింది అనుకుంటూంటే మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
 



ఏదైమైనా పుష్ప-2 ది రూల్‌మరో సారి ఇండియా వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్‌ వెర్షన్‌.. పుష్ప-2కు మరో ఇరవై నిమిషాల పవర్‌ఫుల్‌ ఫుటెజ్‌ను యాడ్‌ చేస్తున్నారు. ది వైల్డ్‌ఫైర్‌ మరింత ఎక్స్‌ట్రా ఫైరీగా మారబోతుంది. అయితే ఈ సినిమా వల్ల సంక్రాంతి రిలీజ్ లకు ఏ మేరకు ఇబ్బంది ఎదురౌతుందని చూడాల్సి ఉంది. అలాగే పుష్ప సీన్ లో ఉంటే థియేటర్స్ సమస్య కూడా వస్తుందంటున్నారు.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందిన పుష్ప-2 ది రూల్‌..ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది.
 

Allu Arjun, Pushpa 2


రిలీజ్ కు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు బ్రేక్ పడటం లేదు. 
 

Pushpa 2: The Rule, Overseas Box Office , allu arjun


పుష్ప 2 సినిమా మొదటి రోజు నుంచే 32 రోజు వరకు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన తాజాగా ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్ఠించింది.

ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డుల సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు.  

Latest Videos

click me!