బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని కీర్తి సురేష్.. మహానటి డిసీషన్ మామూలుగా లేదుగా.!

First Published | Mar 28, 2023, 2:29 PM IST

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy suresh) సౌత్ సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ చిత్రాలపై ఆసక్తి చూపించకపోవడానికి అదే రీజన్ అంటూ మహానటి చెప్పుకొచ్చింది.
 

మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కేరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు భాషల్లోనే ఇప్పటికీ నాలుగైదు ప్రాజెక్ట్స్ కొనసాగుతున్నాయి. చివరిగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. 

ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘దసరా’తో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ సందర్భంగా జోరుగా ప్రమోషన్స్ లో సందడి చేస్తోంది. నానితో పాటు ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో రచ్చ చేస్తోంది. సినిమాపై రీచ్ పెరిగేందుకు చేయాల్సినన్ని ప్రయత్నాలు చేస్తోంది.
 


అయితే కీర్తి సురేష్ కు నటిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ‘మహానటి’. మూవీలో కీర్తి నటనకు ఏకంగా నేషనల్ అవార్డే వరింది. ఆ తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆయా భాషల్లో మంచి ఆఫర్లు అందాయి. ఇదే సమయంలో కీర్తికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు దక్కాయంట. కానీ ఆమెనే రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది.
 

ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ బాలీవుడ్ ఫిల్మ్స్ లో ఇంతవరకు నటించకపోవడంపై ఓపెన్ అయ్యింది. బాలీవుడ్ నుంచి తనకెప్పటి నుంచో ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చింది. కానీ తనకు ప్రాధ్యానత ఉన్న పాత్రలు రావడం లేదని, పైగా కమర్షియల్, గ్లామర్ పరంగానే తనను ఎంపిక చేస్తుండటం నచ్చలేదని అభిప్రాయపడింది.
 

తెలుగు, తమిళంలో మాత్రం తన క్రేజ్ కు తగ్గట్టుగా ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. ఈ కారణంగానే తన కేరీర్ ప్రారంభమై పదేండ్లు దాటినా ఇంతవరకు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదని అర్థమవుతోంది. మరోవైపు కీర్తి తనకు ప్రాధ్యానత ఉంటేనే సినిమాలకు ఓకే చెబుతుందని దీంతో అర్థం అవుతోంది. 
 

ప్రస్తుతం కీర్తి సురేష్ ‘దసరా’తో నార్త్ ఆడియెన్స్ ను కూడా అలరించబోతోంది. నాని - కీర్తి మరోసారి జంటగా రాబోతుండటం విశేషం. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పై  నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించారు. మార్చి 30న చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.
 

Latest Videos

click me!