అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లింప్స్, పోస్టర్స్, ఇటీవల టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఎక్సపెక్టేషన్స్ భారీగా పెంచారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉన్నట్లు వినిపిస్తోంది. పుష్ప 1 సమయంలోనూ అలాగే లాస్ట్ మినిట్ దాకా ఏదో ఒక పని జరుగుతూనే ఉంది.