రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయితే.. రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియాను దాటి.. యూనివర్సల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు ఎదిగాడు. ఎంత ఎదిగినా.. రామ్ చరణ్ మాత్రం తండ్రి చాటు బిడ్డగా.. చిరంజీవి మాటలకు ఎదురు చెప్పకుండా.. ఒకే మాటమీద ఉంటాడు.