Prabhas: మరోసారి గెస్ట్ రోల్ లో ప్రభాస్‌, డైరక్టర్ హింట్ ఇచ్చేసాడుగా

First Published | Sep 4, 2024, 8:14 AM IST

ప్రభాస్ తమ సినిమాలో కొద్ది క్షణాలు కనపడినా కలెక్షన్స్ కుమ్మేస్తాయని అక్కడ హీరోలు భావించటంలో వింతేముంది. 

prabhas

ప్రభాస్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్యాన్ ఇండియా మార్కెట్ లో కింగ్ గా మారుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు నిరాశపరిచాయి.  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు ప్రభాస్. చాలా కాలం తర్వాత తనలోని మాస్ ఏంటో రుచి చూపి సెన్సెషన్ క్రియేట్ చేశాడు. 
 


రీసెంట్ గా  కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ము రేపాడు.  ఇక ప్రభాస్ కు నార్త్ ఇండియాలోనూ మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభాస్ తమ సినిమాలో కొద్ది క్షణాలు కనపడినా కలెక్షన్స్ కుమ్మేస్తాయని అక్కడ హీరోలు భావించటంలో వింతేముంది. తాజాగా ఓ హిందీ చిత్రంలో ప్రభాస్ గెస్ట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. 
 


Prabhas


ప్రభాస్ క్యామియో పాత్రలో కనిపించబోయే సినిమా మరేదో కాదు సింగమ్ ఎగైన్. హిందీలో ‘సింగమ్‌’ సిరీస్‌ చిత్రాలుకు ఎంత డిమాండ్ ఉందో తెలియంది కాదు. బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ - మాస్‌ మసాలా యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు రోహిత్‌ శెట్టి కలయికలో ఈ చిత్రాలు రూపొందాయి. ఈ సిరీస్‌లో భాగంగా తెరకెక్కుతున్న మరో చిత్రమే ‘సింగమ్‌ అగైన్‌’. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Maruthis Prabhas Raja Saab film update out


 ‘సింగమ్‌ అగైన్‌’లో ప్రభాస్‌ గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నటు తెలుస్తోంది. రోహిత్‌ శెట్టి మంగళవారం విడుదల చేసిన ఓ వీడియో ఆ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ‘కల్కి 2898 ఎ.డి’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుండగా, గాల్లో ఎగురుతూ కిందకి దిగిన వాహనం ఆ వీడియోలో కనిపిస్తోంది. 


‘‘ఈ హీరో లేకుండా ‘సింగమ్‌’ అసంపూర్ణంగా ఉంటుంది. ఈ వాహనంలో హీరో ఉన్నాడు. దీపావళికి అందులో నుంచి దిగుతాడు’ అంటూ రోహిత్‌ శెట్టి కామెంట్ జోడించారు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్‌ గెస్ట్ రోల్ లో సందడి చేయనున్నారనే చర్చ ఊపందుకుంది. ‘సింగమ్‌’ సిరీస్‌లో తదుపరి సినిమా ప్రభాస్‌ హీరోగా రూపొందే అవకాశాలూ ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. 


ఇదిలా ఉంటే.. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. అటు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.  టీజర్ లో ప్రభాస్ కళ్లను మాత్రమే రివీల్ చేసిన సంగతి తెలిసిందే.  కన్నప్ప సినిమాలో ప్రభాస్ తన పాత్రను ఎంతో ఇష్టంతో ఎంచుకున్నాడట. ఈ విషయాన్ని  హీరో మంచు విష్ణు వెల్లడించాడు. కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 
 

Latest Videos

click me!