లావణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీ కండీషన్స్? ఆ తర్వాతే ఎంగేజ్ మెంట్ జరిగిందా.!

First Published | Jun 10, 2023, 11:46 AM IST

మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.  ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ తేజ్ - లావణ్య ఎంగేజ్ మెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంగా ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ వేడుకలో సందడి చేసింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ - లావణ్య తాము ఒక్కటవబోతున్నట్టు ఎంగేజ్ మెంట్ తో కన్ఫమ్ చేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

నార్త్ కు చెందిన లావణ్య త్రిపాఠి ఇక్కడి ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయ్యింది. తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. వరుస సినిమాలతోనూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 


కొద్దిరోజులుగా వరుణ్ తేజ్ - లావణ్య  లవ్ స్టోరీ వినిపిస్తూనే ఉండగా.. ఎట్టకేళకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నామని అఫీషియల్ గా తెలిపారు. నిన్నటి ఎంగేజ్ మెంట్ వేడుకలోనూ ఈ లవ్ బడ్స్ ను మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు హాజరై సందడి చేశారు. 
 

ప్రస్తుతం మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే వీరి నిశ్చితార్థం వెనుక ఓ న్యూస్ వినిపిస్తోంది. మెగా ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న లావణ్య త్రిపాఠికి పలు కండీషన్స్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ జరిగిందని అంటున్నారు. 

అయితే, మెగా కోడలిగా రాబోతున్న లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనే కండీషన్ పెట్టారంట. అందుకు యూపీ బ్యూటీ త్రిపాఠి కూడా ఓకే చెప్పిందని, తర్వాతే గ్రాండ్ గా నిశ్చితార్థపు వేడుక జరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిలో వాస్తవం ఎంతున్నదనే మున్ముందు చూడాలి. 
 

ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఇటలీలో పెళ్లి జరగనుందని అంటున్నారు. ఆలోపు ప్రస్తుతం తన చేతిలో ఉన్న చిత్రాలను కూడా కంప్లీ చేయనుందంట. ప్రస్తుతం లావణ్య తమిళంలో ‘తనల్’ చిత్రంలో నటిస్తోంది. చివరిగా ‘పులి మేక’ సిరీస్ తో అలరించింది.
 

Latest Videos

click me!