Published : Dec 16, 2023, 03:35 PM ISTUpdated : Dec 16, 2023, 06:51 PM IST
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ఆర్డర్ అందింది. ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. టైటిల్ పోరులో ముందున్న ఆ కంటెస్టెంట్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
ఆదివారంతో Bigg Boss Telugu 7 ముగియనుంది. ఆరోజే విన్నర్ ను నాగార్జున ప్రకటించేందుకు పక్బందీగా ప్లాన్ చేశారు. ఈసారి విజేత విషయంలో ఎలాంటి లీక్ లు లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే షూట్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది.
26
ఈ క్రమంలో విన్నర్ ఎవరు అయి ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రతి సీజన్ లో ఐదుగురు మాత్రమే ఫైనల్స్ కు వెళ్లేవారు. కానీ ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఆరుగురిలో మొదటి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆడియెన్స్ ను ఎదురుచూసేలా చేస్తోంది.
36
తాజాగా అందుతున్న సమచారం ప్రకారం.. గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ ఎలిమినేషన్ లో అర్జున్ అంబటి (Arjun Ambati) ఉన్నారని తెలుస్తోంది. టైటిల్ రేసు లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న ఈయన ఎలిమినేట్ అయ్యారని సమాచారం. దీంతో విన్నర్ లిస్టు మరింత ఆసక్తికరంగా మారింది.
46
లేటెస్ట్ బిగ్ బాస్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం.. టైటిల్ రేసు లో ముందుగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో శివాజీ, మూడు స్థానంలో అమర్ దీప్ ఉన్నారు. నెక్ట్స్ యావర్, ప్రియాంక ఉండటం విశేషం.
56
ఇక చివర్లో అర్జున్ అంబటి ఉన్నారు. ఈ క్రమంలో అర్జున్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఈసారి సూట్ కేసుతో బయటికి వెళ్లేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. దీంతో టైటిల్ కోసం గట్టి ఫైట్ నెలకొంది. ఎవరైనా టైంప్ట్ అయితే విజేత ప్రకటనలో తారుమారయ్యే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.
66
బిగ్ బాస్ తెలుగు సీజన్7ను నాగార్జున హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. గత సీజన్ తో పోల్చితే ఈసీజన్ ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. ఇక నాగార్జున కూడా తనదైన శైలిలో కంటెంట్ల ఆటతీరుకు తీర్పులిస్తూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం విన్నర్ ను ప్రకటించడంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. లాస్ట్ మినిట్ వరకు సీక్రెట్ గానే మెయింటెన్ చేస్తూ.. ఫైనల్స్ పై ఆసక్తి పెంచారు. ఇక ఆదివారం టైటిల్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి..