Bigg Boss 7:బిగ్ బాస్ 7 విజేత అతడేనా ? ఓటింగ్ ప్రకారమే విన్నర్ ని ప్రకటించారా..  

First Published | Dec 16, 2023, 4:32 PM IST

రైతు బిడ్డ అనే సెంటిమెంట్ తో దూసుకుపోతున్న ప్రశాంత్.. టాలీవుడ్ లో నటుడిగా పాపులర్ అయినా శివాజీ.. బుల్లితెరపై రాణిస్తున్న అమర్ దీప్ టైటిల్ గెలిచేందుకు ప్రధానంగా పోటీ పడుతున్నారు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో విజేత ఎవరు అని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ తో దూసుకుపోతున్న ప్రశాంత్.. టాలీవుడ్ లో నటుడిగా పాపులర్ అయినా శివాజీ.. బుల్లితెరపై రాణిస్తున్న అమర్ దీప్ టైటిల్ గెలిచేందుకు ప్రధానంగా పోటీ పడుతున్నారు. 

Bigg Boss Telugu 7

అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, యావర్ కూడా పోటీ ఇస్తున్నారు కానీ వీళ్ళు ఓటింగ్ లో వెనకబడినట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ఇక సండేరోజు టెలికాస్ట్ మాత్రమే మిగిలింది. విన్నర్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ స్పష్టమైన లీకులు రావడం లేదు. 


పల్లవి ప్రశాంత్ విజయం సాధిస్తాడు అని ప్రేక్షకులు నమ్ముతున్నారు. అందుతున్న సమాచారం మేరకు అత్యధిక ఓటింగ్ ఆర్డర్ గమనిస్తే.. పల్లవి ప్రశాంత్, శివాజీ , అమర్ దీప్ చౌదరి,  యావర్, ప్రియాంక, అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Bigg Boss Telugu 7

ఓటింగ్ ప్రకారమే విజేత ప్రకటన జరిగితే పల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ టైటిల్ దక్కే ఛాన్స్. కానీ ఏమైనా ఉల్టా పల్టా జరిగిందా.. నాగార్జున ఎవరిని విజేతగా ప్రకటించారు అనే ఉత్కంఠ నెలకొని ఉంది. 

పల్లవి ప్రశాంత్ కనుక విజయం సాధిస్తే బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తొలి సామాన్యుడిగా రికార్డు సాధిస్తాడు. ప్రశాంత్ తర్వాత అవకాశం ఉన్నది శివాజీ, అమర్ దీప్ లకు మాత్రమే. ఒక వేళ ప్రశాంత్ విజేత అయితే రన్నరప్ ఎవరనేది కూడా సస్పెన్స్. 

ఈ సస్పెన్స్ వీడాలంటే సండే ఈవెనింగ్ వరకు ఎదురుచూడాల్సిందే. నాగార్జున ముందు నుంచి ఈ సీజన్ మొత్తం ఉల్టా పల్టా అంటూ హైలైట్ చేస్తున్నారు. ఫినాలే లో అందుకు తగ్గట్లుగా ఏమైనా సర్ప్రైజ్ లు ఉన్నాయా అనేది కూడా ఆసక్తిగా మారింది. 

Latest Videos

click me!