మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గుడ్ బై? ఆయన చేసిన పనికి అందరూ షాక్!

Published : May 20, 2024, 04:28 PM IST

అల్లు-కొణిదెల ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చేవిగా ఉన్నాయి. కాగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.   

PREV
15
మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గుడ్ బై? ఆయన చేసిన పనికి అందరూ షాక్!
Allu Arjun-Nagababu

అల్లు అర్జున్ మెగా హీరో అనే బ్రాండ్ నుండి బయటకు  రావాలని చూస్తున్నాడనే వాదన ఉంది. కొన్నాళ్లుగా అల్లు-కొణిదెల ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందనే వాదన ఉంది. దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అల్లు అర్జున్ సీరియల్ అయ్యాడు. వాళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని గోల చేయడంతో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. చెప్పను బ్రదర్ అని అప్పట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్ పవన్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది. 

25
Allu Arjun-Nagababu

అప్పటి నుండే అల్లు అర్జున్ లో ఒక అసహనం కొనసాగుతుంది. అనంతరం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి పలుమార్లు మద్దతుగా ఉన్నారు. పిఠాపురంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆకాంక్ష నెరవేరాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. అయితే జనసేన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం చర్చకు దారి తీసింది. 

 

35
Allu Arjun-Nagababu

నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు.నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నంద్యాలకు మంచి చేయాలి అనుకుంటున్న నా మిత్రుడు రవిని సపోర్ట్ చేయడం బాధ్యతగా  భావిస్తున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించాడు. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగింపు రోజు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం కూటమి అభ్యర్థులకు గొంతులో వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. 

45
Allu Arjun-Nagababu


అల్లు అర్జున్ తీరుపై మెగా ఫ్యామిలీ మొత్తం మౌనం వహించింది. నాగబాబు మాత్రం పోలింగ్ ముగిశాక అల్లు అర్జున్ పై పరోక్షంగా దాడి చేశాడు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే అని ట్వీట్ చేశాడు. నాగబాబు కామెంట్ దుమారం రేపింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబును ట్రోల్ చేశారు. ఆయన ఏకంగా ట్విట్టర్ అకౌంట్ ని డీ యాక్టివేట్ చేశాడు. రెండు రోజుల అనంతరం తిరిగి ట్విట్టర్ లోకి వచ్చిన నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేశానని కామెంట్ చేశాడు. 

 

55
Allu Arjun-Nagababu

అయితే నాగబాబు ట్వీట్ మెగా ఫ్యామిలీలో పెద్ద దుమారమే రేపినట్లు స్ సమాచారం. నాగబాబు మీద చిరంజీవి కూడా సీరియస్ అయ్యాడంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే నాగబాబు తీరుకు హర్ట్ అయిన అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపు నుండి తప్పుకున్నాడట. ఆయన ఫ్యామిలీ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories