మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతున్న అనుష్క శర్మ - విరాట్ కోహ్లి, ఆరోజే శుభవార్త!?

First Published | Sep 30, 2023, 2:58 PM IST

అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఇప్పటికే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది.           

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మరియు ఇండియన్ క్రికెటర్ కోహ్లీ త్వరలో మరోసారి గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల కిందనే వీరిద్దరూ తల్లిదండ్రులు గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులూ సంతోషించారు. 
 

పండంటి ఆడబిడ్డ వామికాకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కూతురుతో కలిసి పలు సందర్భాల్లో విరుష్క జంట మీడియా కంట పడ్డ విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కూడా వామిక ముఖాన్ని చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. 
 


ఇక తాజాగా మరో న్యూస్ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనుష్క శర్మ (Anushka Sharma) రెండోసారి ప్రెగ్నెన్సీ: కన్ఫమ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అనుష్క మళ్లీ గర్భవతి అంటూ వార్తలు వస్తున్నాయి. నటి త్వరలో తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోందని అంటున్నారు. 
 

బి-టౌన్ పవర్ కపుల్ గా ఉన్న విరుష్క నుంచి త్వరలోనే ఆ గుడ్ న్యూస్ రానుందని అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఇక చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2017లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాతి నాలుగేళ్లకు పండంటి ఆడబిడ్డ వామికాకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు.  
 

ఇప్పుడు అనుష్క, విరాట్ త్వరలో తమ రెండవ బిడ్డను స్వాగతించబోతున్నారని వార్తలు రావడం ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపుతోంది. ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రకారం..  అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉందని తెలుస్తోంది. మూడు నెలలు నిండాయని అంటుున్నారు. 

ఇక త్వరలోనే శుభవార్త చెప్పాలనుకుంటోందంట ఈ జంట. దానికీ టైమ్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.  నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఉండటంతో అదే రోజు ఈ గుడ్ న్యూస్ అనౌన్స్ చేస్తారని అంటున్నారు. దీంతో ఆరోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!