‘జవాన్’ పోస్ట్ పోన్ తో.. ‘ఆదిపురుష్’ ప్రీపోన్ అయ్యే ఛాన్స్ అంటూ.. క్రేజీ బజ్

First Published | May 7, 2023, 12:56 PM IST

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ జూన్ 16న రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రీపోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. 
 

‘ఆదిపురుష్’ గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఈ ఏడాది రిలీజ్ కు సిద్ధమైంది. గ్రాఫిక్ వర్క్, విజువల్స్ అంతగా కుదరకపోవడంతో వాయిదా పడింది. ప్రస్తుతం  చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. 
 

జూన్ 16న చిత్రాన్ని విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధమైన విషయం తెలిసిందే.  అయితే తాజాగా బజ్ ప్రకారం.. చిత్రాన్ని ముందుగానే రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. షారుఖ్ ‘జవాన్’ చిత్రం తాజాగా పోస్ట్ పోన్ కావడంతో ఈ న్యూస్ మరింత వైరల్ గా మారింది. 
 


షారుఖ్ ఖాన్ ‘జవాన్’ జూన్ 2న విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదు. ఇంకా హెవీ వర్క్ ఉండటంతో మరికొంత సమయం తీసుకుంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు నిన్ననే కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.  2023 సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 
 

అయితే జూన్ 2న ‘ఆదిపురుష్’ను ప్రీపోన్ చేస్తూ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆదిపురుష్ ట్రైలర్ ను త్రీడీలో 70 దేశాల్లో విడుదల చేయనున్నారు. అలాగే ఇండియాలో 105 థియేటర్లలో మే9న విడుదల చేయబోతున్నారు. 
 

మరోవైపు ప్రఖ్యాత ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ నందు కూడా ప్రదర్శించబోతున్నారు. జూన్ 13న ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ నందు ఆదిపురుష్ మూవీ ప్రీమియర్ వేయనున్నారని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రభాస్ ప్రమోషన్స్ లోనూ దిగనున్న క్రమంలో రోజురోజుకు హైప్ పెరుగుతోంది.
 

ప్రస్తుతం ట్రైలర్ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. ట్రైలర్ అదిరిపోయిందంటున్నారు. చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి పౌరాణిక చిత్రం చేస్తున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ అలరించనున్నారు. 

Latest Videos

click me!