సూపర్ స్టార్ మహేష్ భారీ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కథపై మేకర్స్ హింట్ ఇచ్చేశారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే జంగిల్ అడ్వెంచర్ స్టోరీ అన్నారు. అలాగే ఈ చిత్రంలో మహేష్ పాత్రకు రామాయణంలో హనుమంతుడు పాత్ర ఆధారమని వెల్లడించారు. కాబట్టి మహేష్ రోల్ హనుమంతుడి పాత్రను ప్రతిబింబించేదిగా ఉంటుందట. హనుమంతుడు ఫీచర్స్ అయిన బలం, సాహసం, తెగింపు, స్వామి భక్తి, విశ్వాసం మహేష్ క్యారెక్టర్లో చూడవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.