నందమూరి ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం బాలయ్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల సక్సెస్ తో ఫ్యాన్స్ కి హై జోష్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సంచలనం తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. అబ్బాయి, బాబాయ్ లుగా ఎన్టీఆర్, బాలయ్య మధ్య మంచి అన్యోన్యత ఉంది. తరచుగా వీరిద్దరూ కలుసుకోకపోయినా మంచి బాండింగ్ ఉంది.