సీనియర్‌ ఎన్టీఆర్‌ జీవితంలోని ఈ ఆసక్తికర విషయాలు.. మీకు తెలుసా!

First Published May 28, 2020, 10:07 AM IST

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మూడక్షరాలు ఎన్‌టీఆర్‌. నటుడిగా, రాజకీయానాయుకుడి తెలుగు ప్రజల్లో గుండెల్లో ఆయన స్థానం సుస్థిరం అందుకే ఆ మహానుభావుడి జయంతిని అభిమానులు మాత్రమే కాదు తెలుగు ప్రజలంతా పండుగలా జరుపుకుంటారు.

ఎన్టీఆర్‌కు ఆయన తల్లి కృష్ణుడి పేరు వచ్చేలా పేరు పెట్టాలనుకున్నారు. కానీ ఆయన మేన మామ మాత్రం రాముడి అంశాలో పుట్టిన బిడ్డ అని ఆయనకు తారక రామారావు అని పేరు పెట్టారు. అయితే తల్లి కోరిక మేరకు తన పిల్లలందరికీ కృష్ణ అని వచ్చేలా పేరు పెట్టుకున్నాడు ఎన్టీఆర్.
undefined
ఎన్టీఆర్‌గా నటుడిగా మారిన తరువాత కూడా కొంత కాలం వ్యవసాయం చేశారు. పాలు కూడా పోశారు. 1949లో తొలిసారిగా మనదేశం సినిమాతో బ్రేక్‌ వచ్చిన తరవుాత ఆయన పూర్తిగా నటనకే అంకితమయ్యారు. కేవలం తన స్వశక్తితో వెండితెర వేల్పుగా ఎదిగిన ఆయన ఎంతో మందికి ఇన్సిపిరేషన్‌గా నిలిచారు.
undefined
అప్పటికే హీరోల ప్రాభవం పెరుగుతున్న ఎన్టీఆర్‌ నిర్మాతలకు ఎంతో విలువ నిచ్చేవారు. నిర్మాత కన్నా ముందే మేకప్‌తో సెట్‌ లో రెడీగా ఉండేవారు. ఆయన టాప్‌ స్టార్‌గా ఎదిగిన తరువాత కూడా నిర్మాతల పట్ల అదే గౌరవభావాన్ని చూపించేవారు. కథా కథనాల విషయంలో నిర్మాతల సలహాలు సూచనలు తీసుకునేవారు.
undefined
వెండితెరకు పరుచూరి బ్రదర్స్‌ లాంటి అద్భుతమైన రచయితలతో పాటు నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారయణను, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ను పరిచయం చేసిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే. వాళ్లకు కెరీర్‌ అంతా ఆయన వెన్నుదన్నుగా నిలిచారు.
undefined
అభిమానుల మధ్య వివాదాలు రాకుండా ఉండేందుకు ఆయన ఎంతో కృషి చేసేవారు. అందుకే తన సమకాలీన నటుడైన ఏఎన్నార్‌తో ఎంతో స్నేహంగా ఉండేవారు. వీరిద్దరు కలిసి 14 సినిమాల్లో నటించారు. రాజకీయాల్లోకి కూడా ఏఎన్నార్‌ను ఆహ్వానించారు ఎన్టీఆర్.
undefined
రాజకీయా పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాడు ఎన్టీఆర్. అప్పటి వరకు రాష్ట్రాల్లో పెత్తనం చేస్తున్న జాతీయ పార్టీల హవాకు గండికొట్టి రీజినల్‌ పార్టీలను తెర మీదకు తీసుకువచ్చారు.
undefined
రాజకీయాల్లో రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్య పాన నిషేదం, మహిళలకు ఆస్తి హక్కు లాంటి సంచలన నిర్ణయాలతో తన మార్క్‌ చూపించాడు ఎన్టీఆర్.
undefined
click me!