చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ మూవీకి పోటీగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ బరిలోకి దిగారు. అయినప్పటికీ చిరంజీవి ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎదుగుతున్న ప్రారంభ దశలో కొన్ని అద్భుతమైన సినిమాలు పడ్డాయి. వాటిలో న్యాయం కావాలి ఒకటి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏఈ చిత్రం 1981లో విడుదలై ప్రభంజనం సృష్టించింది. ప్రముఖ రచయిత్రి కామేశ్వరి రచించిన కొత్త మలుపు నవల ఆధారంగా కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
25
15 వేలు రెమ్యునరేషన్
ఈ మూవీలో రాధికా హీరోయిన్. శారద, జగ్గయ్య కీలక పాత్రల్లో నటించారు. 1981 మే 15న ఈ చిత్రం రిలీజ్ అయింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న న్యాయం కావాలి మూవీ చిరంజీవి ఖాతాలో బ్లాక్ బస్టర్ గా చేరింది. ఈ చిత్రానికి చిరంజీవి అందుకున్న రెమ్యునరేషన్ రూ.15 వేలు మాత్రమే.ఈ సినిమాకి పోటీగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ కలిసి బరిలోకి దిగారు.
35
ఎన్టీఆర్, ఏఎన్నార్ మల్టీస్టారర్ మూవీ
న్యాయం కావాలి రిలీజైన 2 వారాల తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ మల్టీస్టారర్ చిత్రం సత్యం శివమ్ విడుదలైంది. అయినప్పటికీ న్యాయం కావాలి మూవీ ప్రభంజనం ఆగలేదు. మరో వైపు సత్యం శివమ్ కూడా మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాల సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ చిరంజీవి లాంటి హీరో సినిమా థియేటర్స్ లో రాణించడం అప్పట్లో సంచలనంగా మారింది.
న్యాయం కావాలి 100 రోజుల వేడుకలో పెద్ద రచ్చే జరిగింది. సినిమా సూపర్ హిట్ కావడంతో చెన్నైలో 100 డేస్ ఫంక్షన్ ని నిర్మాత క్రాంతి కుమార్ చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. సినిమా విజయానికి గుర్తుగా చిత్ర యూనిట్ కి స్టేజీపై షీల్డ్స్ బహుకరించారు. ముందుగా చిరంజీవి షీల్డ్ అందుకున్నారు. ఆ వేడుకకి రచయిత్రి కామేశ్వరి కూడా హాజరయ్యారు. చిరంజీవికి ముందుగా షీల్డ్ బహుకరించడం ఆమెకి నచ్చలేదు.
55
బుజ్జగించిన చిత్ర యూనిట్
తాను రాసిన నవలే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం. అలాంటప్పుడు ముందుగా నాకే షీల్డ్ ఇవ్వాలి. కానీ మీరు నన్ను అవమానించారు. నాకు ఎలాంటి షీల్డ్ వద్దు అని గొడవ చేశారు. దీనితో చిత్ర యూనిట్ ఆమెని బుజ్జగించి శాంతిపజేశారు.