ఫ్లాప్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ అంత పెద్ద రిస్క్ ఎందుకు.. ఎన్టీఆర్ వల్లేనా..

Published : Jul 06, 2024, 01:33 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ శుక్రవారం రోజు తన పుట్టిన రోజు సందర్భంగా బింబిసార ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

PREV
16
ఫ్లాప్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ అంత పెద్ద రిస్క్ ఎందుకు.. ఎన్టీఆర్ వల్లేనా..

నందమూరి కళ్యాణ్ రామ్ శుక్రవారం రోజు తన పుట్టిన రోజు సందర్భంగా బింబిసార ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసార చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా బింబిసార సీక్వెల్ బింబిసార 2 ఉంటుందని అని అంతా అనుకున్నారు. బింబిసార క్లైమాక్స్ కూడా ఆ విధంగానే ముగించారు. 

26

కానీ కళ్యాణ్ రామ్ ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. బింబిసార ప్రీక్వెల్ ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి బింబిసార అనే పదం టైటిల్ లో ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఎన్ కె ఆర్ 22 అని ప్రకటించారు. బింబిసారుడి కంటే కొన్ని తరాల ముందు త్రిగర్తల సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి కథని చూపించబోతున్నారు. 

36

భారీ బడ్జెట్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేలా ఈ చిత్రం ఉండబోతోంది. బింబిసార చిత్రానికి వశిష్ఠ డైరెక్టర్ కాగా.. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్నారు. గతంలో అనిల్.. పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ తో రొమాంటిక్ అనే చిత్రం తెరకెక్కించారు. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. 

46

ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి ఇంత పెద్ద చిత్రాన్ని అప్పగిస్తూ కళ్యాణ్ రామ్ ఎందుకు రిస్క్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ వివరాలు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అనిల్ పాదూరి చాలా ట్యాలెంటెడ్ అట. గత కొన్నేళ్లుగా అనిల్ కళ్యాణ్ రామ్ తో ట్రావెల్ చేస్తున్నారు. 

56

జైలవకుశ, టెంపర్ లాంటి చిత్రాలకు విఎఫ్ఎక్స్ విభాగంలో అనిల్ స్పెషలైజేషన్ ఉంది. ఎన్టీఆర్ తోకూడా ఈ కుర్రాడికి అనుబంధం ఉందని అంటున్నారు. బింబిసార చిత్రం తెరకెక్కించటప్పుడు ఎన్టీఆర్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారో చూశాం. బింబిసార ప్రీక్వెల్ విషయంలో కూడా తారక్ ప్రమేయం తప్పకుండా ఉంటుంది అని అంటున్నారు. 

66

బింబిసార ప్రీక్వెల్ కి భారీగా విఎఫ్ఎక్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విభాగంలో పట్టు ఉన్న అనిల్ పాదూరిని కళ్యాణ్ రామ్ నమ్మారు. ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు. ఈ చిత్రం తెరకెక్కుతున్నప్పుడు తప్పకుండా బింబిసారతో, డైరెక్టర్ వశిష్ఠతో పోలికలు ఉంటాయి. వాటన్నింటిని అనిల్ ఎలా అధికమించి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. 

click me!

Recommended Stories