RC15: ఈ లీక్ నిజమైతే రాంచరణ్ నట విశ్వరూపమే..ఇది కనుక ఇంటర్వెల్ లో పడితే, శంకర్ కాబట్టి సాధ్యమే

Published : May 22, 2022, 08:37 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో నార్త్ లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు. రాంచరణ్ పోషించిన రామరాజు పాత్ర నార్త్ లో బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత రాంచరణ్ తన తండ్రి చిత్రం ఆచార్యలో కీలక పాత్రలో నటించాడు.

PREV
16
RC15: ఈ లీక్ నిజమైతే రాంచరణ్ నట విశ్వరూపమే..ఇది కనుక ఇంటర్వెల్ లో పడితే, శంకర్ కాబట్టి సాధ్యమే

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో నార్త్ లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు. రాంచరణ్ పోషించిన రామరాజు పాత్ర నార్త్ లో బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత రాంచరణ్ తన తండ్రి చిత్రం ఆచార్యలో కీలక పాత్రలో నటించాడు. ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందింది. ప్రస్తుతం రాంచరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.   

26
RC15

సందేశంతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ ఈ చిత్రంలో ఉండబోతోంది. రాంచరణ్ ఈ మూవీలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. విభిన్న గెటప్స్ లో చరణ్ పాత్ర ఉండబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రం నుంచి వరుసగా లీక్ అవుతున్న పిక్స్, కథ గురించి జరుగుతున్న ప్రచారాలు అభిమానులని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. 

36

రాంచరణ్ వివిధ గెటప్స్ లో ఉన్న లుక్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ మూవీలో రాంచరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే గెటప్స్ ఎక్కువగా ఉంటాయట. తాజాగా ఈ చిత్ర కథ గురించి వైరల్ అవుతున్న న్యూస్ ఒకటి మామూలుగా లేదు. ఈ మూవీలో చరణ్ షార్ట్ టెంపర్ యువకుడిగా కనిపిస్తాడట. 

46

ప్రభుత్వ విధానాలు, సిస్టమ్ పై విసిగిపోయిన తరుణంలో రాంచరణ్ కథలో భాగంగా ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. ఊహించుకుంటుంటేనే ఈ న్యూస్ అదిరిపోతోంది. శంకర్ సినిమా కాబట్టి అభిమానులు ఇలాంటి ట్విస్ట్ లు ఆశించవచ్చు. ఇంటర్వెల్ సన్నివేశంలో కనుక రాంచరణ్ ముఖ్యమంత్రిగా మారితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే గూస్ బంప్స్ గ్యారెంటీ. ఇన్ని గెటప్స్ లో రామ్ చరణ్ కనిపిస్తే నట విశ్వరూపమే అని నెటిజన్లు అంటున్నారు. 

56
RC15

ఆర్ఆర్ఆర్ తో నటన పరంగా రాంచరణ్ మరో స్థాయికి చేరాడు. ఇక శంకర్ వర్క్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా ఈ చిత్రం శంకర్ పాత రోజులని గుర్తు చేస్తున్నాయి. ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు అంటూ అవినీతిపై శంకర్ చేసిన సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి. 

66

ఇటీవల శంకర్ రోబో అంటూ టెక్నాలజీ వెంట పడ్డాడు కానీ.. ఆయన అసలు ఎనెర్జీ అవినీతిపై తెరకెక్కించే చిత్రాల్లోనే ఉంది. క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఈ చిత్ర కథలో భాగం అయ్యారు. దిల్ రాజు ఖర్చు గురించి వెనకాడకుండా భారీ బడ్జెట్ ఈ చిత్రానికి కేటాయిస్తున్నారు. రాంచరణ్ సరసన ఈ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories