బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ గా, నటుడిగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించి బ్లాక్ బస్టర్ నిర్మాత అయ్యారు. సినిమా ఈవెంట్స్ లో బండ్ల గణేష్ తన ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ పై వైవిధ్యమైన ప్రశంసలతో బాగా పాపులర్ అయ్యారు. బండ్ల గణేష్ మైక్ పట్టుకుంటే మోతెక్కిపోవాల్సిందే అన్నట్లుగా గుర్తింపు పొందారు.