అనుకోకుండా లేదా మన ప్రమేయం లేకుండా వివాదంలో ఇరుక్కోవడం వేరు. ఒకర్ని గెలికి మరీ వివాదం రాజేయడం వేరు. అనసూయ 'ఆంటీ' వివాదానికి రెండో కండీషన్ అప్లై అవుతుంది. ఇక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఆమె కావాలని గొడవ పెట్టుకున్నారు. లైగర్ కి డిజాస్టర్ టాక్ రాగానే, కర్మ ఫలం అంటూ ఇండైరెక్ట్ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ వివాదానికి కారణమైంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేసేలా చేసింది.
ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాక కూడా ఆమె తగ్గలేదు. నా ట్వీట్ లైగర్ మూవీ గురించి కాదని చెప్పలేదు. మరింత రెచ్చగొట్టేలా ఒకప్పుడు నన్ను తిట్టారు. అందుకే నేను ట్వీట్ వేశాను. లైగర్ ఫెయిల్యూర్ నేను ఎంజాయ్ చేస్తున్నానని ఒప్పుకున్నారు. ఎవరో ముక్కూ ముఖం తెలియని వాళ్ళ ట్వీట్స్ మనం పట్టించుకోవాలా అని, ఊరుకోకుండా వాళ్లకు సమాధానాలు ఇస్తూ వివాదం మరింత పెద్దది చేశారు.
ఇదంతా అనసూయ పబ్లిసిటీ కోసం చేశారా? విజయ్ దేవరకొండపై కోపంతో చేశారా? అనేది పక్కన పెడితే. ఆమెకు ఈ పరిణామం చేటు చేసే సూచనలే ఎక్కువ కనబడుతున్నాయి. ఓ మూవీ పరాజయాన్ని ఎంజాయ్ చేశానని చెప్పి చాలా మంది ఆగ్రహానికి కారణమయ్యారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది జీవితాలను ప్రభావితం చేసే మూవీ ఫెయిల్ అవ్వాలని కోరుకోవడం చాల పెద్ద తప్పు.
దశాబ్దానికి పైగా అనసూయ ఇండస్ట్రీ పైనే బ్రతుకుతుంది. యాంకరింగ్ కూడా పక్కన పెట్టి నటిగా వరుస ఆఫర్స్ తో లక్షలు ఆర్జిస్తోంది. అలాంటి అనసూయకు మూవీ ఫెయిల్యూర్ దర్శక నిర్మాతల నుండి డిస్ట్రిబ్యూటర్స్, హీరో హీరోయిన్స్ ని ఎంత వేదనకు గురి చేస్తుందో తెలియని కాదు. అంటే వాళ్ళందరి ఏడుపును అనసూయ ఎంజాయ్ చేశారంటే దాన్ని శాడిజం అనాలా. ఇందుకే పరిశ్రమకు అనసూయ మీద మండిందనిపిస్తుంది.
మనం గమనిస్తే అనసూయను ఆంటీ అని ట్రోల్ చేస్తున్నా పరిశ్రమ నుండి ఒక్కరు మద్దతు ఇవ్వలేదు. ఒక్క శ్రద్దా దాస్ మాత్రం స్పందించారు. సప్పోర్ట్ చేశారు. ఫక్తు తెలుగు పరిశ్రమకు చెందినవారు కానీ, బుల్లితెర యాంకర్స్ కానీ నోరు మెదపలేదు. కారణం ఆమెదే తప్పని భావిస్తూ ఉండవచ్చు.
అనసూయ తీరు పరిశ్రమ పెద్దలకు కోపం తెప్పించింది అనడానికి మరొక ఉదాహరణ నటుడు బ్రహ్మాజీ ట్వీట్. అనసూయకు ఆయన డైరెక్ట్ గా చురకలు అంటించాడు. ''ఎవర్రా అంకుల్, అంకుల్ అంటే కేసు పెడతా'' అని ట్వీట్ చేశాడు. ఇది ఖచ్చితంగా అనసూయపై ఆయన వేసిన సెటైర్. తనకు అత్యంత సన్నిహితుడు పూరి తెరకెక్కించిన లైగర్ పట్ల అనసూయ వ్యవహరించిన తీరు ఆయనకు కోపం తెప్పించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
దారిన పోయే కంపను ముడ్డికి తగిలించుకున్నట్లు లేని పోనీ గొడవలు పెట్టుకొని అనసూయ కెరీర్ చేజేతులా ప్రమాదంలోకి నెట్టుకుంటుంది. నెగిటివిటీ ఇలానే పెంచుకుంటూ పోతే అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ఆఫర్స్ కోల్పోవడం ఖాయం. ఎస్టాబ్లిష్ అయ్యాం మనకేం ఢోకా లేదు అనుకుంటే పొరపాటే. టెక్కు చూపించిన మహామహులే కనుమరుగైపోయారు.