జబర్దస్త్ ఇంద్రజకు పెద్ద సమస్యే వచ్చిపడిందే... పరిష్కారం కోసం వేడుకున్న మాజీ హీరోయిన్!

First Published May 16, 2021, 3:32 PM IST

నటి ఇంద్రజకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కాక, నెటిజెన్స్ సహాయం తీసుకుంది. తెలిసినవారు నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేసింది. 
 

90లలో ఓ స్థాయి హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలిగింది ఇంద్రజ. యమలీల వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే ఇంద్రజ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కించుకోలేకపోయింది.
undefined
అయితే నాగార్జున, కృష్ణ వంటి స్టార్ హీరోలకు జంటగా ఆమె జతకట్టడం విశేషం. సౌత్ లో అన్ని భాషల్లో ఇంద్రజ పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. 2005లో నటుడు, బిజినెస్ మాన్ అబ్సర్ ని ఇంద్రజ వివాహం చేసుకున్నారు.
undefined
2007వరకు పరిశ్రమలో యాక్టీవ్ గా ఉన్న ఇంద్రజ, ఆ తరువాత గ్యాప్ ఇచ్చారు. అయితే 2014లో ఇంద్రజ లాంగ్ గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చారు. రొమాంటిక్ డ్రామా దిక్కులు చూడకు రామయ్య మూవీలో హీరో తల్లిగా రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
undefined
ప్రస్తుతం ఇంద్రజ హీరో సిస్టర్, వదిన, అత్త, అమ్మ వంటి పాత్రలు చేస్తూ కెరీర్ ముందుకు నడిపిస్తున్నారు. అనారోగ్యం కారణంగా జబర్దస్త్ జడ్జి పదవి నుండి రోజా విరామం తీసుకున్నారు. రోజా స్థానంలో ప్రస్తుతం ఇంద్రజ వచ్చిచేరారు.
undefined
రోజా మాదిరే జబర్దస్త్ కమెడియన్ జోక్స్ కి సందర్భానుసారంగా నవ్వుతూ, మధ్యలో పంచ్ లు విసురుతూ రోజా ప్లేస్ కి తాను పర్ఫెక్ట్ మ్యాచ్ అని నిరూపిస్తున్నారు. జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ సూపర్ సక్సెస్ అన్న మాట వినిపిస్తుంది.
undefined
కాగా అందరు ప్రముఖుల సమాచారం అందించే వికీపీడియా వెబ్ సైట్ లో ఇంద్రజకు సంబంధించిన డిటైల్స్ తప్పుగా ఉన్నాయట. చివరకు తన డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పుగా ప్రచురించారట.
undefined
వికీపీడియాలో తన సమాచారం ఎలా ఎడిట్ చేయాలో తెలిసినవారు సమాచారం ఇవ్వండి అంటూ ఇంద్రజ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
undefined
ఇంద్రజ పోస్ట్ కి పలువురు నెటిజెన్స్ స్పందించారు. వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ ఎలా మార్పు చేయాలో సూచించారు. నెటిజెన్స్ సలహాలకు ఇంద్రజ కృతఙ్ఞతలు తెలిపారు.
undefined
ఇంద్రజ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
ఇంద్రజ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
click me!