దేశాన్ని ప్రేమించాలని నేర్పించన మన రచయితలు మనలోని తప్పులను కూడా అదే స్థాయిలో బయట పెట్టారు. కులాల పేరుతో కుమ్ములాటలు, మతాల పేరుతో మారణ హోమాలు చేసినా మన మంతా భారతీయులమే అని చాటిచెప్పారు. భిన్నత్యంలో ఏకత్వం మన భారతదేశ ప్రత్యేకత. ఎన్ని మతాలున్నా సమభావతో సాగిపోవటం మన నైజం. ఆ విషయాన్ని నిరూపించిన పాట ఖడ్గం సినిమా నుంచి మనకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.