Niharika Konidela: నిహారిక మైండ్ లో ఇప్పుడు రన్ అవుతుంది అదే... ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసింది!

Published : Apr 18, 2023, 03:57 PM IST

ఒక ప్రక్క  విడాకుల వార్తలు హల్చల్ చేస్తుండగా నిహారిక సోషల్ మీడియాలో బిజీగా గడుపుతున్నారు. ఆమె పరోక్షంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి..   

PREV
15
Niharika Konidela: నిహారిక మైండ్ లో ఇప్పుడు రన్ అవుతుంది అదే... ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసింది!
Niharika Konidela

తాజాగా నిహారిక శారీలో ఫోటో షూట్ చేశారు. నిహారిక హోమ్లీ లుక్ కి నెటిజెన్స్ నుండి పాజిటివ్ కామెంట్స్ దక్కుతున్నాయి. అయితే సదరు ఫోటోలకు నిహారిక ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తుంది. సాయంకాలం ఫీలింగ్(In a sunset state of mind..) అని కామెంట్ పెట్టారు. దీనికి మరో అర్థం కూడా చెప్పొచ్చు. ముగిసిపోతున్న భావన... అని కొందరి అభిప్రాయం. 
 

25
Niharika Konidela

నిహారిక విడాకుల వార్తల నేపథ్యంలో ఈ కామెంట్స్  ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత నెల రోజులుగా విడాకుల ప్రచారం జరుగుతున్నా నిహారిక పెదవి విప్పింది లేదు. స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సాధారణంగా నాగబాబు తన కుటుంబం మీద వచ్చే ఆరోపణలకు, పుకార్లకు రియాక్ట్ అవుతారు. కూతురు నిహారిక విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన నోరు మెదపకపోవడం కోసం మెరుపు... 
 

35
Niharika Konidela

అలాగే నిహారిక కెరీర్ మీద దృష్టి పెట్టారు.  నిర్మాతగా రాణించాలని భావిస్తున్నారు. నిహారికకు పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఉంది. ఈ నిర్మాణ సంస్థలో ఆమె కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు నిర్మించారు.ఈ బ్యానర్లో భవిష్యత్తులో కొత్త ప్రాజెక్ట్స్ తెరకెక్కించేందుకు నిహారిక సీరియస్ గా ముందుకు వెళుతున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ తో చర్చలు జరుపుతున్నారు.
 

45
Niharika Konidela

ఈ క్రమంలో భర్తతో విడిపోయిన నిహారిక కెరీర్ కోసం తాపత్రయ పడుతున్నారనేది మరో వాదన.నిహారిక భర్త వెంకట చైతన్య విడాకుల వార్తలకు బీజం వేశాడు. వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు, వివిధ సందర్భాల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు డిలీట్ చేశారు. నిహారిక-వెంకట చైతన్య ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకట చైతన్య-నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. 
 

55
Niharika Konidela

వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన కొద్దిరోజులకు నిహారిక కూడా తొలగించారు. దీంతో భర్తతో విడిపోతున్నానని ఆమె పరోక్షంగా ఆమె చెప్పినట్లు అయ్యింది. విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. 2020 డిసెంబర్ 9న నిహారిక వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఘనంగా పెళ్లి వేడుక నిర్వహించారు.

click me!

Recommended Stories