Illu Illalu Pillalu Today Episode Nov 19: ఇంటికి దొంగలా వచ్చి నాకు ద్రోహం చేశావ్, నమ్మక ద్రోహివి.. కూతురితో సేనాపతి

Published : Nov 19, 2025, 09:11 AM IST

Illu Illalu Pillalu Today Episode Nov 19: సేనాపతి బెయిల్ మీద ఇంటికి వచ్చాక తన కూతురు ప్రేమే తన అరెస్టుకు కారణం అవ్వడంతో ఆమెను మాట్లాడేందుకు పిలుస్తాడు. వారిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది. 

PREV
15
కన్నతండ్రినే అరెస్టు చేయించావు

ప్రేమను సేనాపతి పిలిచి ‘కన్న తండ్రిని అరెస్టు చేయించేంత గొప్ప ఎత్తుకు ఎదుగుతావని ఊహించలేకపోయాను. శభాష్ నా కడుపున నా అదృష్ట దేవత పుట్టిందనుకున్నాను. కానీ నా కూతురే నా పాలిట యమదూత అని ఈ రోజే అర్థమైంది. నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్న ఈ ఆరు నెలల్లో కన్నవాళ్ళు, నిన్ను పెంచిన వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో, ఎంతలా ఏడుస్తున్నారు చూడటానికి నువ్వు ఒక్కసారి అయినా మన ఇంటికి రాలేదు. కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు అర్ధరాత్రి మన ఇంటికి వచ్చావు. ఒక దొంగలా రూమ్ లోకి వచ్చావు. నా ఫోన్ నుంచి దొంగ చాటుగా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకెళ్లిపోయావ్. ఆ క్షణం నీకు అనిపించలేదా కన్నతండ్రిని వెన్నుపోటు పడడం తప్పని’ అని ఏడుస్తూ ప్రశ్నిస్తాడు సేనాపతి.

25
నువ్వు నమ్మకద్రోహివి

ప్రేమ కూడా ఏమాత్రం తగ్గకుండా సమాధానం ఇస్తుంది. ‘తప్పని తెలుసు నాన్నా.. కానీ చేయడం తప్పలేదు. ఏ తప్పు చేయని నర్మదక్కకి జాబ్ పోగొట్టి జైలుకు పంపించాలని చూశారు మీరు. అది ఇంకా తప్పు కదా నాన్న. అది పాపం కూడా కదా నాన్న’ అని అంటుంది ప్రేమ. దానికి సేనాపతి ‘చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావమ్మా మరి నువ్వు నాకు చేసింది ఏమిటి? ఆ కుటుంబం నాకు చేసింది ఏమిటి? నీకు మంచి సంబంధం తెచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశాను. కానీ పెళ్లికి ముందు రోజు నువ్వు వెళ్లిపోయావు. అది తప్పు కాదా? అది మమ్మల్ని మోసం చేయడం కాదా? మన ఇంట్లో పని చేస్తూ మా చెల్లెల్ని ఎత్తుకుపోయాడు. మేము గుండె కోత అనుభవించడానికి కారణమయ్యాడు అది తప్పు కాదు. అది నమ్మకద్రోహం కాదా’ అని ప్రశ్నిస్తాడు సేనాపతి. ‘కడుపున పుట్టిన నీకే మా బాధ అర్థం కాలేదు ఇక వాళ్లకేం అర్థం అవుతుంది. ఐదారు నెలలు పరిచయం ఉన్న వారి కోసం 20 ఏళ్లు పెంచిన కన్న తండ్రి అరెస్టు కావడానికి కారణమయ్యావు. నువ్వు చాలా గ్రేట్. ఏ కూతురు చేయని గొప్ప పని నువ్వు చేసావు. నిన్ను కన్న నేరానికి గొప్ప గుణపాఠం నేర్పావు ఇలాంటి నమ్మకద్రోహి నాకు కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను.’ అని సేనాపతి అంటాడు. దీంతో ప్రేమ తట్టుకోలేక ఏడ్చుకుంటూ అత్తారింటికి వెళ్లిపోతుంది.

35
ప్రేమ ఏడుపు

అందరూ ప్రేమను ఓదార్చేందుకు ప్రయత్నిస్తారు. వల్లీ మాత్రం ఆనందంతో పొంగిపోతుంది. ఎంతమంది చెబుతున్నా ప్రేమ వినకుండా ఏడుస్తూనే ఉంటుంది. వల్లీ ప్రేమను నవ్వించేందుకు ప్లాన్ వేస్తుంది. అమూల్య, వేదవతి, వల్లి, ధీరజ్, చందు, సాగర్ అందరూ ఏవేవో పాటలు పాడి ప్రేమను నవ్వించేందుకు ఎంతో ప్రయత్నిస్తారు. ప్రేమ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది.

45
ప్రేమను నవ్వించలేక

అందరూ ప్రేమను నవ్వించలేక చేతులెత్తేసి వెళ్లిపోతారు. అప్పుడు నర్మదా ప్రేమ చెవిలో ఏదో చెబుతుంది. వెంటనే ప్రేమ నవ్వుతుంది. అప్పుడు అందరూ ఏం చెప్పి నర్మదా నవ్వించిందా అని అడుగుతూ ఉంటారు. తిరుపతి ఆ సమయంలో ఇందాక సాగర్, చందు, ధీరజ్ డాన్స్ చేశారు కదా.. ఆ సమయంలో మీ ప్యాంట్లు జారిపోయి అని చెప్పిందని అంటాడు. దాంతో ముగ్గురు పరువు పోయింది అని అనుకొని పక్కకు వెళ్ళిపోతారు.

55
నర్మదా సాగర్ సరసాలు

ఇక నర్మదా పొద్దున్నే లేచి భర్త సాగర్ ని కూడా నిద్ర లేపుతుంది. ఈరోజు పరీక్ష రిజల్ట్స్ వస్తాయి కాబట్టి గుడికి వెళ్లి పూజ చేయించాలి లేచి రెడీ అవ్వమని చెబుతుంది. ఉదయాన్నే నర్మదతో సరసాలు మొదలు పెడతాడు సాగర్. కానీ నర్మదా, సాగర్ ను ఎలాగోలా లేపి స్నానానికి పంపిస్తుంది. మరోవైపు ప్రేమను నిద్ర లేపుతాడు. ఉదయాన్నే జాగింగ్ కు వెళ్లాలని ప్రేమను సిద్ధం చేస్తాడు. ఇద్దరు జాగింగ్ చేసేందుకు బయటకు వస్తారు. ఇక సాగర్, నర్మదా కలిసి గుడికి వెళ్లేందుకు బయలుదేరుతారు. ఆ సమయంలో వల్లి ఇంటిముందు ముగ్గు వేస్తూ ఎదురవుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories