ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌లో శ్రీవల్లి జీవితంపై విరక్తితో ఉంటుంది. నర్మద ఆమెకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెబుతుంది. అత్తయ్య మామయ్య ఎంత ప్రయత్నించినా చందు బావ మాటవినడం లేదని, విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని అంటుంది. దీంతో శ్రీవల్లి బాధతో ఫోన్ పెట్టేస్తుంది. వల్లి తీవ్రమైన ఆవేదనలో తన భర్త లేని జీవితం ఎందుకని అనుకుంటుంది. రోడ్డుపైకి వెళ్లి లారీకి ఎదురుగా నిల్చుంటుంది. కానీ అదే సమయానికి నర్మద వచ్చి కాపాడుతుంది. చావడం వల్ల ఏమీ సాధించలేవని, బతికి నీ మంచితనం నిరూపించుకోవాలని వల్లి చెంపదెబ్బ కొట్టి మరీ హెచ్చరిస్తుంది.
తనను తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని వల్లి నర్మదను కోరుతుంది. అందుకు నర్మద అంగీకరిస్తుంది. అయితే వల్లి నిజంగా మారిందని అందరికీ తెలియడానికి కొంత సమయం పడుతుందని చెబుతుంది. కోర్టు ప్రక్రియలో తొందరపడి ఎలాంటి సంతకాలు చేయొద్దని సలహా ఇస్తుంది.