Illu Illalu Pillalu Today Episode Feb 5: కూతురిని గెంటేసిన వేదవతి, చనిపోవడానికి సిద్ధమైన అమూల్య

Published : Feb 05, 2026, 09:41 AM IST

Illu Illalu Pillalu Today Episode Feb 5: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి వస్తే వేదవతి ఆమెను ఆసుపత్రి బయటికి తోసేస్తుంది. దీంతో అమూల్య తాను చనిపోతానని అంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
అమూల్యను అవమానించిన వేదవతి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వేదవతి తన కొడుకుల గురించి తిరుపతిని అడుగుతుంది. తిరుపతి వాళ్ళ ముగ్గురు పనిమీద వెళ్లారని చెబుతాడు. ఈలోపు చందు, ధీరజ్ కూడా తిరిగి ఆసుపత్రికి వస్తారు. ధీరజ్‌ను ఆపి ప్రేమ.. అమూల్య ఏమైనా చెప్పిందా అని భయపడుతూ అడుగుతుంది. దానికి ధీరజ్ ‘చెప్పాల్సింది ముందే చెప్పేసింది కదా.. ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను అని ఇంకేం చెబుతుంది. చందు అన్నయ్య కోపంతో కొట్టాడు’ అని చెబుతాడు. అప్పుడు ప్రేమ నువ్వు అమూల్యను ఏమైనా అన్నావా అని అడుగుతుంది. దానికి ధీరజ్ ‘అది నా చెల్లి. దాని నేను ఏమనగలను? అన్నయ్య ఆవేశంలో కొట్టాడు’ అని చెబుతాడు. 

ఇక అమూల్య అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. నాన్నా అంటూ ఏడుస్తూ ఐసీయు దగ్గరికి వెళ్తుంది. తండ్రి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు వేదవతి ఆవేశంగా అక్కడికి వస్తుంది. ‘ఎంత ధైర్యం ఉంటే చేసిందంతా చేసి మళ్ళీ వచ్చావు. ఎంత పని చేసావే.. నీ వల్లే కదా ఆయనకు ఈ పరిస్థితి. ఎంత అల్లారుముద్దుగా చూసారే నిన్ను. అలాంటి వ్యక్తి గుండెల మీద తన్నావు కదే’ అని నానా మాటలు అంటుంది. నీవల్లే ఆయనకు గుండెపోటు వచ్చింది అని అమూల్యకు శాపనార్థాలు పెడుతుంది వేదవతి. కోపంగా అమూల్యను చెయ్యి పట్టుకుని ఆసుపత్రి నుంచి బయటికి లాక్కొస్తుంది. బయటికి తోసేయడంతో అమూల్య అక్కడ పడిపోతుంది. అది చూసి నర్మద, ప్రేమ చాలా బాధపడతారు. వేదవతి ఇక్కడి నుంచి పో, ఇకనుంచి మా కంటికి కనిపించకు, ఈరోజుతో మీతో సంబంధం మాకు తెగిపోయింది అని చాలా కఠినంగా అమూల్యతో మాట్లాడుతుంది. తిరుపతి వేదవతిని లోపలికి తీసుకెళ్లిపోతాడు. నర్మద, ప్రేమ అమూల్యను పైకి లేపి పక్కకు తీసుకొస్తారు.

24
సేనాపతి ఇంటికి భాగ్యం

ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్, భాగ్యం దగ్గరికి మారుతుంది. ఇద్దరూ కలిసి సేనాపతి ఇంట్లోకి దొంగల్లాగా కిటికీలోంచి దూరతారు. ఎలాగైనా నర్మద కాళ్లు పట్టుకొని తమ పేరు చెప్పకుండా కాపాడమని అడిగేందుకు వారు వెళ్తారు. అమూల్య కోసం అన్ని గదులు వెతుకుతూ ఉంటారు. గది గది తిరుగుతూ విశ్వ గదిలోకి కూడా వెళ్తారు. విశ్వ మంచి నిద్రలో ఉంటాడు. 

మరొక గదిలోకి వెళ్తే మొత్తం చీకటిగా ఉంటుంది. భయంతో ఇడ్లీ బాబాయ్ గందరగోళం చేసేస్తాడు. ఆ చీకటి గదిలో ఎవరో అతడిని చితక్కొట్టేసి హాల్లోకి తోసేస్తారు. ఈ లోపు అక్కడికి భద్రావతి, సేనాపతి వస్తారు. చీకట్లోనే ఇడ్లీ బాబాయిని సేనాపతి చితక్కొడతాడు. ఎందుకు ఇంట్లోకి వచ్చారు అని అడుగుతుంది భద్రావతి. ఆమె కాళ్ళ మీద పడి ఇడ్లీ బాబాయ్, భాగ్యం.. ‘విశ్వకు, అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది నా కూతురేనని వాళ్లకి తెలిస్తే నా కూతురు కాపురం కూలిపోతుంది.. కాబట్టి అమూల్య మా అమ్మాయి పేరు చెప్పకుండా నోరు మూయించండి’ అని అడుగుతారు. 

దానికి భద్రవతి ఆ అమ్మాయి ప్రస్తుతం ఇంట్లో లేదు, వాళ్ళ నాన్నను చూడడానికి ఆసుపత్రికి వెళ్ళింది.. ఆ పిల్ల నోరు తెరవకపోతే మీ అదృష్టం లేకపోతే మీ పని అంతే అని సేనాపతి, భద్రావతి చెబుతారు. దాంతో భాగ్యం ఇడ్లీ బాబాయ్ ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. మధ్యలో విశ్వక్ అడ్డుకుంటాడు. అమూల్యను కిడ్నాప్ చేసే వరకు నా ప్లానే. ఆ తర్వాత మీ ప్లాన్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. దానికి భాగ్యం మాకు ఏమీ తెలియదని అక్కడ నుంచి పారిపోతారు.

34
చనిపోతానన్న అమూల్య

ఇక్కడ నుంచి మళ్లీ సీన్ ఆసుపత్రి దగ్గరికి మారుతుంది. అమూల్య కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. నర్మద, ప్రేమ ఆమెను ఓదారుస్తూ ఉంటారు. అమూల్య ఏడుస్తూ ‘నాకు చచ్చిపోవాలని ఉంది’ అనే గట్టిగా అరుస్తుంది. ‘నేను ఎందుకు బతకాలి. నాన్నతో చావుతో పోరాడే పరిస్థితి రావడానికి కారణం నేనే. కళ్ళల్లో పెట్టి పెంచుకుంటే అందుకు నేను నాన్నకు ఇలాంటి పరిస్థితిని బహుమతిగా ఇచ్చాను. నాలాంటి చెడ్డ కూతురు బ్రతికి ఉండకూడదు’ అని ఏడుస్తుంది. 

దానికి నర్మద ‘ఆ విశ్వక్ చేసిన కుట్రకు నువ్వు బలయ్యావు. కానీ తల్లిదండ్రులని మోసం చేయాలనుకోలేదు. నీ తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. నువ్వు మంచి కూతురువే అవుతావు. అత్తయ్య ఏదో కోపంలో మాట్లాడారు. కొన్ని రోజులకి తగ్గిపోతుంది’ అని సర్ది చెబుతారు. అమ్మ నాతో జీవితాంతం మాట్లాడదు నా మొఖం చూడదు అని ఏడుస్తూనే ఉంటుంది అమూల్య. ‘నాన్నకి ఇలాంటి పరిస్థితి రాకూడదనే ప్రేమ వదిన చెప్పినట్టు నేను మెడలో తాళి వేసుకొని వచ్చాను. ఇంత చేసినా కూడా ఏం ప్రయోజనం చెప్పండి’ అని అడుగుతుంది.

 దానికి నర్మద ‘నువ్వు తాళి వేసుకొని రావడం వల్లే ఎంతోకొంత పరువు నిలబడింది. నీ జీవితంపై మచ్చ పడకుండా ఉంది. మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చారని అందరు అనుకుంటున్నారు. అలా కాకుండా నీ మెడలో తాళి లేకపోతే.. విశ్వ నీ మీద వేసిన నింద నిజమైపోతుంది. మీ అన్నయ్యలు విశ్వను చంపి జైలుకు వెళతారు. ఒకవైపు నీ ప్రాణాలు పోయి, ఇంకోపక్క మీ అన్నయ్యలు జైలుకు వెళితే మన కుటుంబమే నాశనం అయిపోతుంది. ప్రేమ నీకు ఇచ్చిన సలహా నీ ప్రాణాలే కాదు, మన కుటుంబాన్ని కూడా నిలబెట్టింది. మేము ఈ సమస్యను పరిష్కరించేవరకు నువ్వు సహనంగా ఉండు’ అని చెబుతుంది నర్మద.

44
వల్లి గురించి అంతా చెప్పేసిన అమూల్య

‘నిన్ను మా అన్నయ్య ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని మేము నిరూపించిన తర్వాత కూడా వాడిని గుడ్డిగా నమ్మి.. ఇంట్లోంచి బయటికి ఎందుకు వెళ్లావు? అలా వెళ్లకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా’ అని నర్మద, ప్రేమ అమూల్యని అడుగుతారు. దానికి అమూల్య జరిగిందంతా చెబుతానని, కానీ చెప్పాక ఎవరితోనూ గొడవ పడవమని, ఎవరికీ ఆ విషయం చెప్పమని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది. దానికి అమూల్య చేతిలో ప్రేమ, నర్మద ఇద్దరూ ఒట్టేస్తారు.

 ‘ఆరోజు విశ్వతో మాట్లాడటానికి నా అంతట నేను వెళ్లలేదు. వల్లి వదినే తీసుకెళ్లింది. అసలు విశ్వను ప్రేమించమని నాతో చెప్పింది వల్లి వదినే. విశ్వ నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడని, మన రెండు కుటుంబాలు కలవడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని నాతో చెప్పింది. అందుకే నేను ప్రేమించాను’ అని అసలు విషయం చెప్పేస్తుంది. దాంతో ప్రేమకు చాలా కోపం వచ్చి దాని సంగతి చెబుదాం పద అని నర్మదతో అంటుంది. కానీ అమూల్య మీరు ఎవరితోనే గొడవపడమని నాకు మాట ఇచ్చారు కదా అని అంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories