సంగీత దిగ్గజం ఇళయరాజా వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం అందించారు. ఆయన పాటలకు అభిమానులుగా మారని వారుండరు. ఇప్పటి సినిమాల్లో కూడా ఆయన పాటలు వాడుతున్నారు. అంతగా ప్రజల మనసుల్లో ఆయన పాటలు నిలిచిపోయాయి. ఆ పాటల ప్రవాహంలో ఇళయరాజా రెండు సినిమాల్లో ఒకే పాట ట్యూన్‌ని ఉపయోగించారు.
DID YOU KNOW ?
`కూలీ` చిత్రంతో రచ్చ చేసిన రజనీ
రజనీకాంత్ ఇటీవల `కూలీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి నెగటివ్ టాక్ వచ్చినా నాలుగు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం.
24
రజనీకాంత్, కమల్ పాటలకు ఒకే ట్యూన్
ఇళయరాజా ఎక్కువ సినిమాలకు సంగీతం అందించిన హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్. వారి సినిమాల విజయంలో ఇళయరాజా సంగీతం కీలక పాత్ర పోషించింది. రజినీ, కమల్‌లకు ఎన్నో హిట్ పాటలు ఇచ్చిన ఇళయరాజా, వారిద్దరి సినిమాల్లోనూ ఒకే ట్యూన్‌తో రెండు పాటలు కంపోజ్ చేశారంటే నమ్మగలరా? ఆశ్చర్యం ఏంటంటే ఆ రెండు పాటలూ ప్రజలకు బాగా నచ్చాయి. విశేష ఆదరణ పొందాయి. శ్రోతలను అలరించాయి.
34
`వసంత కోకిల`లోని యేసుదాసు పాడిన పాట
బాలు మహేంద్ర దర్శకత్వంలో కమల్ హాసన్, శ్రీదేవి నటించిన `మూడ్రాం పిరై`(తెలుగులో వసంతకోకిల) సినిమాలోని పాటలు బాగా హిట్ అయ్యాయి. సినిమా విజయంలో ఈ సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. కన్నదాసన్ రాసిన, యేసుదాస్ పాడిన 'Poongaatru Puthithaanathu` పాటలోని ఇంటర్లూడ్‌లో ఒక ట్యూన్ ఉంటుంది. ఆ ట్యూన్‌నే రజినీకాంత్ సినిమాలో కూడా వాడారు ఇళయరాజా.
44
రజనీకాంత్ `తంబిక్కు ఎంత ఊరు`లో పాత ట్యూన్
1984లో వచ్చిన `తంబిక్కు ఎంత ఊరు` సినిమాలో ఎస్పీ బాలు పాడిన 'ఎన్ వాళ్విలే' పాటలో ఆ ట్యూన్‌నే వాడారు. ఆ రెండు పాటలూ ఎప్పటికీ గుర్తుండిపోయే మాస్టర్ పీస్ గా నిలిచింది. తమిళ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. `తంబిక్కు ఎంత ఊరు` సినిమాలోని 'కాదలిన్ దీపం ఒండ్రు' పాటలోని లిరిక్స్‌ని కమల్ హాసన్ `కళ్యాణ రామన్` సినిమాలో కూడా వాడారు. ఈ రెండు పాటలూ హిట్ అయ్యాయి. అది ఇళయరాజా మ్యాజిక్ అంటే.