రజినీకాంత్ సినిమా కోసం ఇళయరాజా కంపోజ్ చేసిన ఓ పాట తలైవాకు నచ్చలేదు. కానీ, ఇళయరాజా చెప్పిన ఒక్క మాటతో ఆ పాట సూపర్‌హిట్ అయింది. ఇంతకీ అప్పుడేం జరిగింది..? ఏంటా పాట?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్‌స్టార్ రజినీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కాంబోకు తిరుగులేదు. కానీ, వాళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఒక ఎవర్ గ్రీన్ పాటను రజినీకాంత్ వద్దన్నారు. ఎన్నిసార్లు విన్నా ఆ పాట రజినీకి నచ్చలేదు. అప్పుడు ఇళయరాజా చెప్పిన ఒక్క మాటతో రజినీ ఓకే అన్నారు.
25
వేరే పాట చేద్దామా?
1992లో 'మన్నన్' సినిమా పనులు జరుగుతున్నాయి. అప్పుడు ఇళయరాజా 'అమ్మ ఎండ్రు అళైక్కాద' పాట ట్యూన్ వినిపించారు. ఆ టైంలో రజినీకాంత్ మాస్ హీరోగా, యాక్షన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పాట విన్న రజినీ, 'రాజా, ఈ పాట చాలా స్లోగా ఉంది. నా ఇమేజ్‌కు సెట్ అవుతుందా? అభిమానులు ఒప్పుకుంటారా? ఇది వదిలేసి వేరే పాట చేద్దామా?' అని అడిగారు.
35
రజినీకాంత్ కు భరోసా ఇచ్చిన ఇళయరాజా
రజినీకాంత్ మొహమాటాన్ని గమనించిన ఇళయరాజా ఒక జోస్యం చెప్పారు. 'రజినీ, ఇప్పటిదాకా మీరు కమర్షియల్ హీరోగా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించారు. కానీ ఈ పాట రిలీజ్ అయ్యాక, మీరు ప్రతీ ఇంటి హాల్‌లోకి వెళ్తారు. ఇది మిమ్మల్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది' అన్నారు. ఇళయరాజాలోని ఆ నమ్మకాన్ని చూసి రజినీకాంత్ ఒప్పుకున్నారు.
'మన్నన్' సినిమా రిలీజయ్యాక ఇళయరాజా చెప్పింది అక్షరాలా నిజమైంది. వాలి రాసిన సాహిత్యం, జేసుదాస్ గాత్రం, రజినీ నటన కలిసి ఆ పాటను ఒక క్లాసిక్‌గా మార్చేశాయి. అప్పటివరకు యాక్షన్ హీరోగా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్, రజినీని తమ ఇంటి సభ్యుడిగా చూడటం మొదలుపెట్టారు. దీంతో రజినీకాంత్ 'ఫ్యామిలీ ఆడియన్స్' సంఖ్య కొన్ని రెట్లు పెరిగింది.
55
'అమ్మ' పాటల్లో ఒకటి
అప్పట్లో ఇళయరాజా చెప్పిన మాటలు కేవలం రజినీని ఒప్పించడానికే కాదు, అదొక గొప్ప కళాకారుడి ముందుచూపు. ఒకవేళ ఆ రోజు రజినీ పట్టుబట్టి ఆ పాటను వద్దని ఉంటే, తమిళ సినిమా ఓ గొప్ప 'అమ్మ' పాటను కోల్పోయేది. ఇప్పటికీ మదర్స్ డే వచ్చిందంటే చాలు, మొదట వినిపించేది ఈ పాటే!