కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. 2002లో విడుదలైన ఈశ్వర్ ప్రభాస్ మొదటి చిత్రం . వర్షం, ఛత్రపతి, యోగి, బిల్లా వంటి చిత్రాలు ప్రభాస్ కి మాస్ హీరో ఇమేజ్ తెచ్చాయి. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో ఆయనకు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు.