తేజస్విని సినిమాల్లోకి వెళ్తే స్టార్‌ హీరోయిన్‌ అయ్యేది.. భార్య రహస్యాలు బయటపెట్టిన బాలయ్య అల్లుడు..

Published : Jun 17, 2024, 10:32 PM ISTUpdated : Jun 17, 2024, 10:39 PM IST

బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నెమ్మదిగా సినిమాల్లోకి వస్తుంది. ఆమె `బీబీ4`తో నిర్మాతగా పరిచయం అవుతుంది. కానీ ఆమె నటిగా ఎంట్రీ ఇస్తే పెద్ద స్టార్‌ అయ్యేదని ఆమె భర్త కామెంట్‌ చేశారు.  

PREV
17
తేజస్విని సినిమాల్లోకి వెళ్తే స్టార్‌ హీరోయిన్‌ అయ్యేది.. భార్య రహస్యాలు బయటపెట్టిన బాలయ్య అల్లుడు..

 నందమూరి నట సింహం బాలకృష్ణ.. ప్రస్తుతానికి నందమూరి ఫ్యామిలీకి రిప్రెజెంట్‌గా ఉన్నాడు. పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఆయన సినిమాల్లో జోరు చూపిస్తున్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు హిట్‌ సినిమాలు చేసి హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌ కి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. సరికొత్త మాస్‌ యాక్షన్‌ మూవీగా ఇది తెరకెక్కుతుంది. 

27
Mokshagna

బాలకృష్ణ తన వారసత్వాన్ని తీసుకురాబోతున్నారు. తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. హరికృష్ణ, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, తారకరత్న, చైతన్య కృష్ణ హీరోగా చేశారు. ఇటీవల కొత్త ఎన్టీఆర్‌ ని పరిచయం చేస్తున్నట్టు దర్శకుడు వైవీఎస్‌ చౌదరీ ప్రకటించారు. 
 

37

మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన విజయవాడ సత్యానంద్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడట. త్వరలోనే హీరోగా రాబోతున్నారని అంటున్నారు. ఇటీవల విశ్వక్‌ సేన్‌ కూడా ఆ విషయాన్ని తెలిపారు. బాలయ్యతో విశ్వక్‌ సేన్‌కి మంచి అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన చర్చ జరిగి ఉంటుంది. 
 

47

ఇదిలాఉంటే అంతకు ముందే కూతురు తేజస్వినిని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు బాలయ్య. బోయపాటి శ్రీనుతో ఇటీవల సినిమాని ప్రకటించిన విషయం తెలిసింది. `బీబీ 4` గా రాబోతున్న ఈ మూవీకి తేజస్విని సమర్పకురాలిగా వర్క్ చేస్తున్నారు. నిర్మాణంలోనూ భాగమవుతున్నారు. అయితే తేజస్వినికి మొదట్నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ అట. చాలా రోజులుగా బాలయ్య సినిమాలకి తెరవెనుక పనిచేస్తుందట. కాస్ట్యూమ్స్ సెలెక్షన్‌తోపాటు సినిమాల ఎంపికలోనూ ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. 
 

57

క్రియేటివ్‌ సైడ్‌ తేజస్విని చాలా ఆసక్తి ఉంటుందట. చాలా టాలెంటెడ్‌ కూడా అని చెప్పాడు ఆమె భర్త శ్రీ భరత్‌. ఆయన ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బాలయ్యకి అన్నీ తానై చూసుకుంటుందని చెప్పారు. అన్‌ స్టాపబుల్‌ టాక్‌ షో విషయంలో ఆమె ఇన్‌ వాల్వ్ మెంట్‌ ఉందట. ఆమె గైడెన్స్ ప్రకారమే బాలయ్య చేస్తున్నారు. 
 

67

అంతకు ముందు బాలకృష్ణ అంటే కోపం ఎక్కువ, కొడతాడనే భావన ఉండేది, కానీ అన్‌ స్టాపబుల్‌ షో తర్వాత ఆయనలో హ్యూమర్‌ కూడా ఉందని జనాలకు తెలిసింది. మరో సైడ్‌ ఆడియెన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఆ క్రెడిట్‌ తేజస్వినికి దక్కుతుందని తెలిపారు భరత్‌. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం వెల్లడించారు.

77
Tejaswini Nandamuri

తను సినిమాల్లోకి వచ్చి ఉంటే నటిగా చేస్తే పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయ్యుండేదన్నారు. పాపులర్‌ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకునేది అని తెలిపారు భరత్‌. బాలయ్య ఎంకరేజ్‌ చేసి ఉంటే తేజస్విని ఇప్పుడు పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయ్యుండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తేజస్విని లుక్‌ పరంగా హీరోయిన్లకి ఏమాత్రం తక్కువ కాదు కదా, వాళ్లని మించి ఉంటుంది. ఈ క్రమంలో నిజంగానే నటిగా మారి టాలీవుడ్‌ని షేక్‌ చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. కానీ ఇప్పుడు క్రియేటివ్‌ సైడ్‌ ఆమె వర్క్ చేయబోతుంది. తెరవెనుక కథ నడిపించబోతుంది. నిర్మాతగా మెప్పించబోతుంది తేజస్విని. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories