పక్కనే స్టార్ హీరో, ఆ డైరెక్టర్ చేసిన పనికి సింగర్ సునీత షాక్.. ఆఫ్ట్రాల్ ఎంత అంటూ..

First Published Jun 17, 2024, 8:36 PM IST

మధురమైన గాత్రంతో క్రేజీ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చెరిగిపోని గుర్తింపు సొంతం చేసుకున్నారు సునీత. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పేది సునీతనే.

మధురమైన గాత్రంతో క్రేజీ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చెరిగిపోని గుర్తింపు సొంతం చేసుకున్నారు సునీత. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పేది సునీతనే. సునీత ఎంత చక్కగా పాటలు పాడుతుందో అంతే చక్కటి రూపంతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. 

ఆ మధ్యన సునీత రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రామకృష్ణ వీరపనేని అనే వ్యాపార వేత్తని ఆమె వివాహం చేసుకున్నారు. ఇటీవల తన కొడుకుని హీరోగా కూడా లాంచ్ చేశారు. అయితే ఆ ప్రయత్నం అంతగా ఫలించలేదు. 

టాలీవుడ్ లో ఎస్పీ బాలు లాంటి లెజెండ్స్ కూడా మెచ్చే గాయని సునీత. ఇటీవల ఇంటర్వ్యూలో సునీత ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. శ్రీరామరాజ్యం చిత్ర డబ్బింగ్ జరుగుతున్న సమయంలో లెజెండ్రీ డైరెక్టర్ బాపు గారితో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంది. డైరెక్టర్ బాపు అంటే ఇక చెప్పేదేముంది.. ఆయన వస్తుంటే ప్రతి ఒక్కరూ లేచి నిలబడి గౌరవిస్తారు. 

డబ్బింగ్ చెప్పడం కోసం సునీత వస్తోందట. డబ్బింగ్ స్టూడియోలో బాపు గారు ఏదో రాసుకుంటున్నారు. సునీత రాగానే బాపు పైకి లేచి నిలబడి నమస్కరించారట. సునీత కోసం బాపు లాంటి వ్యక్తి లేచి నిలబడాల్సిన అవసరం లేదు. ఆయన సంస్కారానికి సునీత షాక్ అయ్యారట. సునీత మాత్రమే కాదు.. పక్కనే ఉన్న బాలకృష్ణ కూడా ఆశ్చర్యపోయారట. 

దీనితో బాలయ్య.. సునీతతో చెబుతూ.. బాపుగారు నీ విద్యకి, కళకి ఇచ్చిన గౌరవం అది అని చెప్పారట. అంతే కాదు సునీతకి బాపు ఆటోగ్రాఫ్ కూడా విచిత్రంగా ఇచ్చారట. నీ వీరాభిమాని బాపు అని రాశారట. 

అది చూసి బాలసుబ్రహ్మణ్యం గారు, చాలా మంది కుళ్లుకున్నట్లు సునీత తెలిపారు. ఈ సంఘటన తర్వాత బాపు గారే లేచి నిలబడి నమస్కరించారు. ఆయన ముందు ఆఫ్ట్రాల్ నేనెంత ? ఆయనకే అంత సంస్కారం ఉంటే నాకెంత ఉండాలి అని అనిపించిందని సునీత తెలిపారు. 

Latest Videos

click me!